పవన్ టార్గెట్ లో నిజాలు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా తన విమర్శలకు స్పీడ్ ను పించి తెలుగుదేశ అధినాయకత్వాన్ని టార్గెట్ చేయడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్ళుగా తెలుగుదేశా ప్రభుత్వానికి ప్రియమిత్రుడుగా కొనసాగిన పవన్ ఇలా ఎవరూ ఊహించని విధంగా టర్న్ తీసుకోవడం వెనుక అనేక ఆసక్తికర విషయాలు జరిగాయి అని టాక్.

గత కొంతకాలంగా తెలుగుదేశ ప్రముఖులలోని కొందరు తమ వద్ద ఎవరైనా పవన్ ప్రస్తావన తీసుకు వస్తే ఆవిషయాలను తేలికగా తీసిపారేసిన సంఘటనలు పవన్ దృష్టి వరకు వెళ్ళడంతో పవన్ తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. దీనికితోడు వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో తన ‘జనసేన’ కు భారీగా ఎమ్.ఎల్.ఎ. సీట్లు కావాలని ఇప్పటికే పవన్ కొందరితో తెలుగుదేశం అధినాయకత్వానికి రాయబారాలు పంపినా వారు ఈవిషయమై మౌనం వహించడం కూడ పవన్ కు తీవ్రఆవేశానికి కారణం అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 


దీనితో మారుతున్న పరిస్తుతులను గమనించిన పవన్ వెంటనే తన స్ట్రాటజీ మార్చాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం కాపులను సినిమా అభిమానులను నమ్ముకుని సీఎంగా ముందుకు వస్తే తాను చిరంజీవిలాగా ఓడిపోయి రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకోవాల్సి పరిస్థుతులు వస్తాయని ఊహించిన పవన్ అనుకోకుండా ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ తెలుగుదేశ పార్టీ అవినీతి అంశాలను ముందుగా క్యాచ్ చేసి జనం ముందుకు చాలవేగంగా వచ్చాడు అన్న విశ్లేషణలు వస్తున్నాయి. అయితే రాబోతున్న 2019 ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ పాత్రకే ఇష్టపడతాడు అదేవిధంగా రాబోతున్న ఎన్నికలలో గెలిచే పక్షం వైపు మొగ్గు చూపుతాడు అని మరికొందరు అంటున్నారు. 

ఒక ప్రముఖ మీడియా సంస్థ చేసిన సర్వేలో పవన్ కళ్యాణ్ చిరంజీవి కంటే మంచి వాడు, సమర్ధుడు, ఏదో చెయ్యాలి అనే తపన ఉన్నవాడు అని సామాన్య ప్రజలు భావిస్తున్నట్లుగా ఒక సర్వే న్యూస్ ను బయటపెట్టింది. దీనితో 2019 ఎన్నికలలో ఎవరో ఒకరికి సహకరించి వారు కూడ ఫెయిల్ అయిన తరువాత 2024లో జనం ముందుకు వచ్చి తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వమని అడిగే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం. ఇది ఇలా ఉండగా పవన్ ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశ ప్రభుత్వ అవినీతి పై మాట్లాడుతూ ‘అందరి దృష్టిలో ఉన్నవే నేను అన్నాను’ అని కామెంట్ చేయడం బట్టి రాబోతున్న ఎన్నికలలో పవన్ ఎలాంటి టర్న్ తీసుకున్నా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: