ఇప్పుడు పవన్ ఆడియో ఫంక్షన్ కు వెళితే.. టిడిపి చేతిలో ఇరుకున్నట్టే..!

Prathap Kaluva
పవన్ కళ్యాణ్ సినిమా లకు రాం రాం చెప్పి పూర్తి గా రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు మాత్రమే కేటాయిస్తున్నాడు. అయితే నితిన్ హీరో గా నటిస్తున్న సినిమా కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని స్వయంగా నితిన్ ప్రకటించాడు. నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను మరో 4రోజుల్లో పెట్టుకున్నారు.


ఈ సినిమా నిర్మాతల్లో పవన్ కల్యాణ్ కూడా ఒకడు. త్రివిక్రమ్, సుధాకర్ రెడ్డితో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు పవన్. సో.. సినిమాకు హైప్ తీసుకురావాలంటే పవన్ హాజరవ్వాల్సిందే. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల మధ్య పవన్ మళ్లీ ఇలాంటి ఫంక్షన్లకు వస్తాడా అనేది డౌట్. ఎందుకంటే.. ఇండస్ట్రీకి దాదాపు దూరమైపోయాడు పవన్. ప్రస్తుతం పవర్ స్టార్ అని పిలిపించుకోవడం కంటే జనసేనాని అనిపించుకోవాలని ఎక్కువగా తహతహలాడుతున్నాడు.

టీడీపీ నేతలపై, మరీ మఖ్యంగా లోకేష్ పై తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టాడు. ఇలాంటి టైమ్ లో మళ్లీ టాలీవుడ్ వైపు తొంగిచూసినా, ఏదైనా ఈవెంట్ కు హాజరైనా టీడీపీ వాళ్లకు విమర్శించడానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది. సినిమా ఫంక్షన్లకు హాజరవ్వడంలో తప్పులేదు. పలువురు రాజకీయ నాయకులు కూడా సినీ ఫంక్షన్లకు వస్తుంటారు. కానీ పవన్ సినిమా ఫంక్షన్ కు హాజరైతే మాత్రం అది విమర్శలకు తావిస్తుంది. టాలీవుడ్ కు పూర్తిగా దూరమయ్యానని తనుకుతాను ప్రకటించుకున్న పవన్, ఓ సినీవేడుకకు హాజరైతే విమర్శల జడివాన తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: