వెంకీ అట్లూరికి సమస్యగా మారిన అఖిల్ !

Seetha Sailaja
అక్కినేని కుటుంబ వారసత్వం నాగార్జున ప్రోత్సాహం ఎంత ఉన్నా అఖిల్ దురదృష్టం ముందు నిలబడలేకపోతున్నాయి. వరసగా ఒక యంగ్ హీరోకు రెండు ఘోర పరాజయాలు ఎదురైతే అతడితో సినిమాలు చేయడానికి ఏదర్శకుడు అయినా చాల ఆలోచిస్తాడు. ఇప్పుడు అటువంటి విచిత్ర పరిస్థితి అఖిల్ కెరియర్ లో కొనసాగుతోంది. 

అక్కినేని అఖిల్ మూడవ సినిమాకు సంబంధించి దర్శకత్వం వహించడానికి ఎందరో టాప్ డైరెక్టర్స్ తో ప్రయత్నాలు చేసినా చిట్టచివరకు ఈ ప్రయత్నాలు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దగ్గర ఆగాయి. ‘తొలిప్రేమ’ సూపర్ సక్సస్ తో మంచి పెరులోకి వచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ ను అఖిల్ మూడవ సినిమాకు దర్శకత్వం వహించే విధంగా నాగార్జున ఒప్పించాడు. 

అయితే అఖిల్ కు ఎట్టి పరిస్తుతులలోను హిట్ ఇవ్వాలి అన్న టెన్షన్ తో దర్శకుడు వెంకీ అట్లూరి అఖిల్ కోసం తయారుచేసుకున్న కథ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. దీనితో తనకు కథను మరింత మెరుగుగా డెవలప్ చేసేందుకు సమయం కావాలి అని వెంకీ అట్లూరి నాగార్జునను కోరినట్లు తెలుస్తోంది. 

ఈ కథ ఎప్పటికి పూర్తి అవుతుంది తన మూడవ సినిమా షూటింగ్ ఎప్పటికి మొదలు అవుతుంది అన్న టెన్షన్ లో అఖిల్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంకాక్ నేపధ్యంలో సుమారు 60 శాతం కథ ఈసినిమాకు సంబంధించి అక్కడ షూట్ చేయబడుతుంది అన్నవార్తలు వినపడుతున్నాయి. ఏమైనా అఖిల్ పేరు చెపితే టాప్ డైరెక్టర్స్ మాత్రమే కాదు యంగ్ డైరెక్టర్స్ కూడ కన్ఫ్యూజన్ లో ఉండటం ఆశ్చర్యకరం.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: