నగ్నంగా నటించినా.. ఇబ్బంది పడలేదంటున్న హీరోయిన్..!

Chakravarthi Kalyan
సినిమా షూటింగ్ అంటే మాటలు కాదు.. చుట్టూ జనం.. కెమెరా మేన్.. మేకప్ మేన్, లైట్ బాయ్, డైరెక్టర్.. ఇలా చుట్టూ ఎంత మందో.. అంతా చుట్టూ ఉన్నా.. ఎవరూ లేరనుకుని సీన్ పై మనసు లగ్నం చేస్తే తప్ప దృశ్యం రక్తి కట్టదు. మరి అలాంటిది ఇక నటించేది నగ్న దృశ్యమైతే.. ఇక ఆ నటీనటుల ఇబ్బంది చెప్పనలవి కాదు కదా.. 


కానీ పక్కా ప్రొఫెషనల్ గా ఫీలై నటిస్తే న్యూడ్ నటించినా ఇబ్బందేమీ అనిపించదంటోంది హాలీవుడ్ హీరోయిన్ జెన్నిఫర్. ఇటీవల ఆమె నటించిన ఓ స్పె థ్రిల్లర్ మూవీలో ఫుల్ న్యూడ్ సీన్ ఉందట. రెడ్ స్పారో చిత్రంలో ఈ సీన్ నటించిందట. ఆ సినిమా విశేషాలు ఇటీవల ఆమె మీడియాతో పంచుకుంది. మరి న్యూడ్ నటించేందుకు ఇబ్బందేమీ కలగలేదా అని అడిగితే అబ్బే అలాంటిదేమీ లేదని చెప్పింది. 


’డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ నా దగ్గరకొచ్చారు.. చుట్టూ సినిమా టీమ్‌ ఉంది. నేనప్పుడు చేస్తోన్న సీన్‌లో చిన్న కరెక్షన్‌ చెబుతున్నాడు. నేను న్యూడ్ గా ఉన్నా.. నా ఒంటి మీద బట్టలున్నట్టుగానే ఫ్రాన్సిస్ చూశారు.  నేనూ నా ఒంటి మీద బట్టలున్నట్టే భావించాను. చుట్టూ ఉన్నవాళ్లంతా ప్రొఫెషనల్స్‌. నాకేం ఇబ్బంది అనిపించలేదు.’ అని ఆనాటి సీన్ వివరాలు చెప్పకొచ్చింది జెన్నిఫర్. 



ఐతే.. ఇలాంటి సీన్లు కథకు అవసరమైతే చేయడానికి నటీమణులు ఇప్పుడు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. హాలీవుడ్ నటీమణులు మాత్రేమే కాదు.. బాలీవుడ్, టాలీవుడ్ లోనూ కొందరు ఇలాంటి సాహసాలు చేస్తున్నారు. ఆ మాత్రం డేర్ చేస్తేనే కదా మంచి పేరు తెచ్చుకునేది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: