లేటు వయసులో.. ఎంత ఘాటు అందమో..! పిచ్చెక్కించేసిన ఐశ్వర్యా రాయ్..!!

Vasishta

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ లేటు వయసులో కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. ఇప్పటికీ ఆమె ఫొటోషూట్‌ల‌ కోసం అంతర్జాతీయ మ్యాగజైన్స్‌ క్యూ కడుతున్నాయ్ అంటే బీటౌన్ లో అమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఈ బ్యూటీ వోగ్‌ మ్యాగజైన్‌కు ఫొటోషూట్‌ ఇచ్చింది. అమెరికన్‌ గాయకుడు విలియం ఫ్యారెల్‌తో కలిసి ఐష్‌ ఈ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. తెలుపు, నీలం, ఎరుపు రంగు దుస్తుల్లో ఐష్‌ ఇచ్చిన పోజులు ప్రజెంట్ నెట్ లో సందడి చేస్తున్నాయ్.


బాలీవుడ్ బ్యూటీస్ లో వయసు పెరిగినా చెక్కుచెదరని అందంతో ఆడియన్స్ దిల్ ని హాంఫట్ చేస్తున్న బ్యూటీ ఐశ్వర్యారాయ్. నీలికళ్లు.., మత్తెక్కించే చూపులతో రెండు దశాబ్దాల క్రితం ప్రేక్షకులను ఎలా మైమరిపించిందో... ఇప్పటికీ అదేస్థాయిలో మాయ చేస్తోంది. అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని ఆరాధ్యకు జన్మనిచ్చాక ఐశ్వర్య సినిమాలు సెలక్టివ్ గానే చేస్తోంది. అయినా కూడా అప్పుడప్పుడు ఫొటో షూట్లు.. ర్యాంప్ వాక్ లతో తనలోని గ్లామర్ కంటెంట్ ను బాగా ఎలివేట్ చేస్తూనే ఉంది.


తాజాగా ఓగ్ మ్యాగజైన్ కోసం ఐశ్వర్య ఫొటో షూట్ చేసింది. ఫేమస్ అమెరికన్ సింగర్ ఫారెల్ విలియమ్స్ తో కలిసి కవర్ పేజీ కోసం రెడ్ కలర్ డ్రస్ లో ఆమె ఇచ్చిన ఫోజ్ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ లుక్ లో ఐశ్వర్యను చూసిన వాళ్లంతా పదేళ్లక్రితం ఎలా ఉండేదో అచ్చం అలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.. క్లీవేజ్ అందాలు కనీకనిపించకుండా రెడ్ స్కార్ఫ్ తో కవర్ చేస్తూ వయ్యారంగా నుంచుని ఉన్న ఐష్ స్టిల్స్ సినీ లవర్స్ ని మత్తెక్కించేలా చేశాయ్.
ఎలా చూసిన ఐశ్వర్య గతేడాది మొత్తం ఈవెంట్లలో తప్ప వెండితెరపై కనిపించలేదు. ప్రజెంట్ అనిల్ కపూర్ తో కలిసి ఫనే ఖాన్ సినిమా చేస్తోంది. బెల్జియన్ ఫిలిం ఎవ్రిబడీస్ ఫేమస్ కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని అతుల్ మంజ్రేకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకుముందే ఐష్ ఫోటోషూట్ తో రచ్చ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: