అనుష్క పెళ్ళి మరో రెండేళ్ళు వాయిదా?

దక్షిణ భారత చలన చిత్ర రంగంలో మకుటంలేని మహారాణి అనుష్క షెట్టి, కుటుంబంతో సహా అభిమానులకు ఆమే స్వీటి షెట్టి.  అమె యోగా శిక్షకురాలు అనేది అందరికి తెలిసిందే. బాహుబలి సీరిస్ దేశవ్యాప్తంగా ఆమెకు అసంఖ్యాక అభిమానులను తెచ్చిపెట్టింది. దేవసేనగా ఆమె నటన పతాక స్థాయికి చేరి కీర్తి దిగంతాలకు వ్యాపించటంతో, అనుష్కకు ఎప్పటినుంచో మలయాళం సినిమాలో నటించాలనే ఆమె కోరికను మలయాళ  సూపర్ స్టార్ ముమ్మట్టి గుర్తించాడట.


శరత్‌ సందీప్‌  దర్శకత్వం వహించనున్న భారీబడ్జెట్ సినిమాకు అనుష్కను హీరోయిన్ గా ఎంపిక చేయాలని దాదాపు ముమ్మట్టి ఫిక్స్ అయ్యాడు. దాంతో తన కోరిక ఈ విధంగా తీరుతుందని స్వీటీ ఆనందం వ్యక్తం చేస్తోంది.


పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్పటివరకు లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న స్వీటీ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయారు.


సీనియర్ నిర్మాత  ఎం శ్యాంప్రసాదరెడ్డి నిర్మాణ సారధ్యంలో వచ్చిన “అరుంధతి” ఆమె దిశ దశనే మార్చేసింది. ఆ చిత్రంతో టాలెంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత వరుసగా వచ్చిన చిత్రాలు ఆమె కెరీర్ నే పూర్తిగా మలుపుతిప్పాయి.


అరుంధతి తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలైన పంచాక్షరి, రుద్రమదేవి, బాగమతి అనుష్క నటించిన చెప్పుకోదగ్గ చిత్రాలు.  దర్శకుడు గౌతమ్ మీనన్ తో సినిమా చేస్తునట్టు అనుష్క తెలియజేసింది. అయితే ఇప్పటివరకు ఆ చిత్రం ప్రారంభంపై ఎటువంటి సమాచారం లేదు..


అయితే అనుష్క ఈలోపే తాను పెద్ద గండం నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నట్లు చెపుతుందట.  అదే ఆమె పెళ్లి విషయం. ఈ రెండు సినిమాలు ప్రారంభమయ్యే నాటికే  అనుష్క కు పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు కోరుకుంటున్నారట. వయసు పెరుగుతోందని పెళ్లికి ఒత్తిడి చేయడంతో అనుష్క కూడా ఈ ఏడాది చేసుకుంటా నని వారికి మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.


ఇలాంటి పరిస్థితుల్లో స్వీటీ తలిదండ్రులు చూసిన సంబంధానికి ఒకే చెప్పేస్తే రెండు సినిమాలు కాస్త లేట్ గా రిలీజ్ అయ్యే ప్రమాదం ఉంది. లేదా సినిమాలు పూర్తయిన అనంతరం పెళ్లి చేసు కోవాలని నిర్ణయించుకుంటే మరో మూడేళ్లు ఆగాల్సిందేనని. దాంతో అనుష్క ఎటూ తేల్చుకోలేక పోతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: