పూనమ్ కౌర్ ను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ ను ఆడుకుంటారా..!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలిన ఒప్పుకోదు పూనమ్ కౌర్ అది ఒకప్పుడు ఇప్పుడు మాత్రం ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ మీద విమర్శనా బాణాలు సందిస్తుంది. ఇంతకు ముందు కూడా తన ట్వీట్ లో ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను విమర్శలు చేసినట్లు కనిపించింది. అయితే ఇప్పుడు ఒక న్యూస్ తెగ హల చల్ చేస్తుంది. పూనమ్ కౌర్ దగ్గర పవన్ కళ్యాణ్ కు సంభిదించి ఏవి సాక్ష్యాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజంగా ఆ వీడియోస్ పవన్ కళ్యాణ్ పొలిటిల్ కెరీర్ ను నాశనం చేస్తాయని అందరు అభిప్రాయం పడుతున్నారు. 


ఇప్పుడు వున్నట్లుండి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఓ ఛానెల్ లో పూనమ్ కౌర్ ఇంటర్వూ ప్రసారం కాబోతోంది. దాని కోసం విడుదలయిన ప్రోమో కాస్త సంచలనంగానే వుంది. ఈ ప్రోమో చూస్తుంటే పూనమ్ చాలా సంచలన విషయాలు వెల్లడించినట్లు అనిపిస్తోంది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ ఇంటర్వూలో అంత లేదట. పూనమ్ కౌర్, కర్ర విరగకుండా, పాము చావకుండా ఇంటర్వూ ఇచ్చినట్లు తెలుస్తోంది. హడావుడే తప్ప, ఈ ఇంటర్వూలో పవన్ కు డ్యామేజ్ చేసేది ఏమీ వుండదని తెలుస్తోంది.


ఇదంతా పవన్ ను కాస్త అలర్ట్ చేసి, కాస్త తగ్గేలా చేయడానికి వేస్తున్న ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు. అవకాశం ఇచ్చి, తమ క్యాంప్ లోకి తీసుకోవడం, అలాగే ఆమె ఇంటర్వూ ప్రత్యేకంగా ప్రసారం చేయడం ద్వారా పూనమ్ కౌర్ తమ క్యాంప్ లో వుందని పవన్ ను అలర్ట్ చేయడం తప్ప వేరు కాదని అనుకోవాల్సి వస్తోంది. అందుకే జస్ట్ కాస్త ఓ అలర్ట్ డోస్ ఇంటర్వూ ప్రసారం చేసి, పవన్ కు ఒకటో నెంబర్ హెచ్చరిక ఇస్తున్నట్లు కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: