వారు మానవ మృగాలు..రాక్షసులు!

Edari Rama Krishna
భారత దేశంలో ఇప్పుడు ఉన్నావో, కథువా ఘటనలపై ప్రజలు, సెలబ్రెటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో పాటు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.  దేశంలో రోజు రోజుకీ మహిళలపై అన్యాయాలు..అక్రమాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని..కొంత మంది కామంధులు చిన్న పిల్లలు, వృద్దులను సైతం వదలడం లేదని..కామంతో కళ్లు మూసుకు పోయిన వీరు మృగాళ్లా, రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని..ఇలాంటి వారిలో ఏ మార్పు ఉండదని..చట్టం వీరిని కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాన్ మాజీ భార్య నటి రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నావో, కథువా ఘటనలను చూస్తుంటే..ఆడపిల్లలుగా పుట్టడమే వీరు చేసిన పాపమనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ఫేస్ బుక్ పోస్ట్ చేశారు.  ‘అసిఫా, నిర్భయ, ఉన్నావో యువతి... వీళ్ళందరూ వివిధ వయసులకు చెందిన వారు. కులాల రీత్యా గాని ప్రాంతాల రీత్యా గాని వీరికి ఎటువంటి సంబంధం లేదు, కానీ అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బాధితులంతా (వీరంతా) అడపిలల్లే. ఇంతటి దుర్మార్గులు మన సమాజంలోనే మన మద్యనే తిరుగుతున్నారని..ఇలాంటి సమాజంలో ఆడపిల్లగా పుట్టడమే తప్పుగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే చర్యలను చేపట్టాలని ప్రముఖ లాయర్లను, ఓ ప్రఖ్యాత సామాజిక సేవా కార్యకర్తను, ఒక పోలీసు ఉన్నతాధికారిని కోరగా ..‘ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు, గుండెల్లో భయం పుట్టే విధంగా ఎప్పుడైతే ప్రభుత్వం చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పటిదాకా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ర్యాలీలు నిర్వహించినా ఎటువంటి ఉపయోగం ఉండదని’ తేల్చి చెప్పారు.

ఎప్పుడైతే ప్రభుత్వం కఠినమైన చట్టాలను ఏర్పాటు చేస్తుందో అప్పుడే ఈ హృదయ విదారక ఘటనలకు చరమగీతం పాడచ్చు. అప్పటి వరకు మన ఆడపిల్లలను సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది .. ఎందుకంటే కన్న తండ్రే తన కూతుళ్లను రేప్ చేసిన చరిత్ర మనకుంది... అందుకే మన ఆడపిల్లలకు తగిన రక్షణ కలిగిస్తూ మనం భద్రంగా కాపాడాల్సిన అవసరం మనకు ఉంది!’ అని రేణూ దేశాయ్ అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: