రేణు దేశాయ్ మౌనం పై పవన్ అభానుల అసహనం !

Seetha Sailaja
పవన్ పై శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ కు మెగా కాంపౌండ్ నుండి గట్టి సమాధానం వచ్చింది. పవన్ తల్చుకుంటే ఏమైనా చేయగలడు అంటూ నాగబాబు శ్రీరెడ్డి కి కౌంటర్ ఇచ్చిన కొద్ది సేపటికే శ్రీ రెడ్డి తాను చేసినది తప్పు అని చెపుతూ పవన్ తల్లిని క్షమార్పణలు అడుగుతూ కొద్ది సేపటి క్రితం ట్విట్ చేసి తన పోరాటానికి మరొక ట్విస్ట్ ఇచ్చింది. 

ఈరోజు ఉదయం మీడియా ముందుకు వచ్చిన నాగబాబు పవన్ ఇండస్ట్రీలో జరిగే ప్రతి విషయానికి సమాధానం చెప్పడమే పనిగా పెట్టుకోలేదు అంటూ పవన్ కు వత్తాసు పలుకుతూ ఉద్వేగపూరితంగా కామెంట్స్ చేసాడు. అంతేకాదు తమ సహనాన్ని పరీక్షించవద్దని అలా చేస్తే తాము ఎలా రియాక్ట్ అవుతామో తమకే తెలియదు అంటూ నాగబాబు హెచ్చరికలు జారీ చేసాడు. 

అయితే ఇంత వ్యవహారం ప్రస్తుతం పవన్ అభిమానులను కుదిపేస్తూ ఉన్నా ఇప్పటి వరకు పవన్ కు సపోర్ట్ గా రేణు దేశాయ్ ఒక్క ట్విట్ కూడ పెట్టకపోవడం పవన్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పవన్ తో రేణు దేశాయ్ విడిపోయినా గతంలో అనేక సార్లు పవన్ కు బాసటగా ట్విట్స్ పెట్టడమే కాకుండా పవన్ పాత ఫొటోలతో పాటు మరికొన్ని సంఘటనల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గుర్తుకు చేయడం రేణు దేశాయ్ హాబీ.

అంతేకాదు పవన్ విషయాల పై స్పందించే సర్వహక్కులు తనకు ఉన్నాయని ఈవిషయంలో తనను ఎవరూ ఆపలేరు అని అంటూ గతంలో పవన్ అభిమానులకే చురకలు వేసింది రేణు దేశాయ్. అయితే ఈరోజు ఉదయం నుండి పవన్ కు బాసటగా నాగబాబు స్వయంగా రంగంలోకి దిగిన పరిస్థుతులలో కూడ రేణు ఈ వ్యవహారం పై ఒక్క ట్విట్ కూడ పెట్టకపోవడమే కాకుండా గత పదిరోజులుగా రేణు సోషల్ మీడియాలో మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటీ అంటూ పవన్ అభిమానులు ఆలోచనలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా శ్రీ రెడ్డి చేత మెగా కాంపౌండ్ క్షమార్పణలు చెప్పించుకుంది కాబట్టి ఈ వ్యవహారం ఇక్కడతో ముగిసిపోతుంది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: