అల్లు అరవింద్ వాఖ్యలపై వర్మ కౌంటర్!

siri Madhukar
టాలీవుడ్ లో మొన్నటి వరకు కాస్టింగ్ కౌచ్ గురించి పలు ఛానల్స్ లో ఊదరగొట్టిన శ్రీరెడ్డి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్..తల్లిగారిని టార్గెట్ చేసుకొని ఓ బూతు మాట మాట్లాడింది. అంతే అప్పటి వరకు అందరి మద్దతు కూడగట్టుకొని దూకుడు పెంచిన శ్రీరెడ్డి ఎపిసోడ్ ఒక్కసారే యూటర్న్ తీసుకుంది.  ఆమెకు మద్దతు ఇచ్చే వారంతా ఒక్కసారే యాంటీగా మారారు..ఇక పవన్ ఫ్యాన్స్ అంతే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.  దాంతో శ్రీరెడ్డి తన బాధను స్నేహితురాలితో షేర్ చేసుకున్న ఫోన్ లీక్ కావడం మరో వివాదానికి తెరలేపింది. 

ఇంతలోనే శ్రీరెడ్డి విషయంలో జోక్యం చేసుకున్నారు..సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ.  వాస్తవానికి శ్రీరెడ్డికి ఏమీ తెలియదని..ఉద్యమం ముందుకు సాగాలంటే..ఓ సెలబ్రెటీని ఏదైనా వివాదాస్పద వ్యాఖ్య అంటే బాగుంటుందని..అది పవన్ కళ్యాన్ అయితే మరీ బెటర్ అని ఒకప్పుడు కత్తి మహేష్ అంటే ఎవరికీ తెలియదని..అలాంటిది కత్తి మహేష్ ఇప్పుడు సెలబ్రెటీ అయ్యారని..సలహా ఇచ్చానని..దాంతో శ్రీరెడ్డి..పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిందని పవన్ కళ్యాన్..ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు.

ఇది కాస్త వైరల్ కావడతంతో..స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి రాంగోపాల్ వర్మను ఉతికి..ఆరేసారు.  దీనికి కౌంటర్ గా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా పోస్ట్‌తో ఆయన చేసిన ప్రతి కామెంట్‌కు సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ విషయంలో వేగంగా స్పందించిన అల్లు అరవింద్... శ్రీరెడ్డి విషయంలో నెల రోజులుగా చిన్న కామెంట్ కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన ఘనత వర్మదన్న అరవింద్ కామెంట్స్‌పై గట్టిగా స్పందించారు. ఇండస్ట్రీ మీరా... పవన్ కళ్యాణా... మీరు నాకు బ్రేక్ ఇచ్చారా... తల్లి పాలేంటి... తాను పవన్‌ను అని తన రొమ్మును తానే గుద్దుకున్నాననే కాని... తాను ఇంకెవరి రొమ్ము గుద్దలేదన్నారు.

పవన్‌ ఆకాశమంత ఎత్తు ఉన్న సూపర్‌స్టార్‌, లీడర్‌. ఆయన స్థాయి తగ్గించడానికి నేనెవరని? ఎంతటివాడిని? నూటికి నూరు శాతం నేను చేసింది క్షమించరాని తప్పే. అరవింద్ గారు, మీ మీద నాకు చాలా గౌరవముంది..ఎప్పటికీ ఉంటుంది..100% నేను చేసింది క్షమించరాని తప్పు.. మళ్లీ ఇంకొకసారి మీకు, పవన్ కల్యాణ్ కి, మీ కుటుంబ సభ్యులకీ ఫాన్స్ కీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను.

అంతే కాకుండా మళ్లీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మీ మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ మీద కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టనని మా మదర్ మీద, నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నాను.గతంలో నా ఒట్లు నేను నిలబెట్టుకోకపోయుండచ్చు.. కానీ మా మదర్ మీద నేనెప్పుడూ ఒట్టేయలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: