భరత్ కు ప్లస్ గా మారిన పవన్ అభిమాని స్లోగన్ !

Seetha Sailaja
నిన్న విడుదలైన ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇక అందరి దృష్టి ఈమూవీ కలక్షన్స్ ఏరేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తాయి అన్న అంశం పై చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో నిన్న పవన్ వీరాభిమాని ‘భరత్ అనే నేను’ మూవీని చూసి ధియేటర్ నుండి బయటకు వస్తు చేసిన కామెంట్ ను ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రముఖంగా ప్రసారం చేస్తోంది.

‘భరత్’ మూవీని చూసిన తరువాత పవన్ వీరాభిమాని ఉద్వేగంతో ఊగిపోతూ ఈసినిమాను పవన్ అభిమానులు అందరూ చూడవలసిందిగా పిలుపు ఇచ్చాడు. పవన్ వ్యక్తిగత జీవితంలో మీడియా ఆదిపత్యం పై పోరాటం చేస్తున్నట్లుగా ‘భరత్’ మూవీలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన మహేష్ మీడియా పై చేసిన పోరాటం చూస్తే తనకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొన్ని ప్రముఖ మీడియా సంస్థల పై చేస్తున్న పోరాటం గుర్తుకు వచ్చింది అని అంటున్నాడు. 

మహేష్ ‘భరత్ అనే నేను’ లో మీడియాను టార్గెట్ చేసే కీలకమైన సన్నివేశం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై మీడియా ప్రదర్శించే అత్యుత్సాహాన్ని ఈసినిమాలో మహేష్ తప్పుపడుతూ చెప్పిన డైలాగులకు మంచి స్పందన వస్తోంది. మీడియా పనికిమాలిన విషయాల బదులు సమస్యల పై ఫోకస్ చేస్తే చాలమంచి జరుగుతుంది అని ‘భరత్’ పాత్రలో మహేష్ చెప్పిన డైలాగ్ పవన్ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అవుతోంది. 

దీనితో పవన్ వీరాభిమానులు కొందరు ఓపెన్ గా మహేష్ మూవీ ‘భరత్’ ను చూడండి అంటూ పిలుపు ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈమూవీకి పవన్ అభిమానులు కూడ తోడైతే ‘రంగస్థలం’ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే పవన్ అభిమానుల అత్యుత్సాహం వల్ల మహేష్ ‘భరత్’ రికార్డులను క్రియేట్ చేసే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: