తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోలు సూర్య, కార్తి. ‘గజిని’ చిత్రం నుంచి తెలుగు ఇండస్ట్రీతో మంచి ఫోలోయింగ్ సంపాదించిన సూర్య ఆ తర్వాత సింగం సీరీస్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. తెలుగు ఇండస్ట్రీలో సూర్యకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. అంతే కాదు గతంలో హుదూత్ తుఫాన్ వచ్చినపుడు 40 లక్షల విరాళం ఇచ్చిన తన మంచి మనసు చాటుకున్నాడు.
ఇక కార్తీ కూడా అన్నబాటలో నడుస్తూ తమిళంలో నటించిన ప్రతి సినిమా తెలుగు లో డబ్బింగ్ చేయిస్తుంటాడు. ఇక నాగార్జున, కార్తీ నటించిన ‘ఊపిరి’ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సూర్య తండ్రి శివకుమార్ తమిళంలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. వారసత్వపు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా..తమ టాలెంట్ తో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించారు. తాజాగా సూర్య సోదరి బృంద సినీ రంగ ప్రవేశం చేసింది. కాకపోతే ఆమె నటిగా కాకుండా సింగర్ గా పరిచయం అయ్యింది.
సీనియర్ హీరో కార్తీక్, ఆయన తనయుడు గౌతమ్ కార్తీక్ కలిసి ఈ చిత్రంలో నటించిన ఒకపాటను ఆమె పాడారు. అలానే సిఎస్ సామ్ సంగీతం అందించి, విద్య దామోదరన్ రాసిన ఈ చిత్ర టైటిల్ ట్రాక్ ని కూడా ఆమె పాడారట. ఈ నేపథ్యంలో మరొక మంచి టాలెంటెడ్ సింగర్ తమ సోదరి రూపంలో తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉందని అంటున్నారు చిత్ర యూనిట్.