చైనాలో 'బాహుబలి'
రాజమౌళి
బాహుబలి మనోహర దృశ్యకావ్యం విశ్వవినీల విశ్వాన్ని ప్రదక్షిణ చేస్తూ విశ్వజావళి భావోద్వేగం సర్వత్రా ఒకటే అనేలా అలరిస్తున్నాడు.
ఆ సామ్రాజ్యాధినేతకు విశ్వం మంగళహారతి పడుతుంది. ఆ సినిమా మన
సంస్కృతి ప్రతిబింబంలా బాసిల్లుతూ విశ్వ యవనికపైకెక్కినా అందులో భావోద్వేగాలు, భాష, దృశ్య సౌందర్యం,
సాదృశంగా భాష, ప్రాంతాలను వదిలేసి
విశ్వమానవాళికి చేరువయ్యాయి.
అందుకే బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నాడు. భారతదేశంలో ఘనవిజయాన్ని సొంతం చేసుకొని, ఎన్నో రికార్డుల్ని కొల్లగొట్టిన బృహత్చిత్రరాజం "బాహుబలి: ది కన్క్లూజన్" విదేశాల్లో కూడా విశేషంగా ఆదరణ చూరగొంటుంది. జపాన్లో ఈ చిత్రం ఇటీవలే నూరు రోజుల పండగ జరుపుకుంది. ఈ సందర్భంగా జపాన్ రాజధాని టోక్యో లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనకి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో పాటు చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ హాజరయ్యారు. వాళ్లకి జపనీయులు ఘన స్వాగతం పలికారు. ప్రదర్శన అనంతరం ప్రేక్షకులంతా లేచి "బాహుబలి... బాహుబలి..." అని నినదిస్తూ చిత్ర బృందాన్ని అభినందించారు. ధన్యవాదాలు అని తెలుగులో రాసిన ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం.