పవన్ కళ్యాణ్ మీద నమ్మకాలు పోతున్నాయి..!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ తాను మాట్లాడిన మాట మీద నిలబడటం లేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఒక విషయంగా గురించి ఆవేశంగా మాట్లాడతాడు. దాని గురించి ఒక కార్య చరన ఉండదు. దాని గురించి చివరి వరకు పోరాడడు అనే విషయాలు ప్రజల్లో బలంగా నారుకుపోయాయి అని చెప్పవచ్చు. ఓకే విషయం కాదు ప్రతి విషయం లో స్పష్టత ఉండవు. ఆవేశం తప్ప. పవన్ కళ్యాణ్ ది మొదటి నుంచీ ఆరంభశూరత్వం, హడావుడి తప్ప, కంటిన్యూటీ అన్నది వుండదు. అది ఏ విషయంలో నైనా.


కేంద్ర రాష్ట్ర వ్యవహారాలపై కమిటీ అన్నారు, హడావుడి చేసారు. ఏదో తేల్చారు. ఇంకేదో తేలుస్తామన్నారు. అంతే సంగతులు. ఆయనతో కలిసి కొన్ని రోజులు హడావుడి చేసిన పెద్దలు ఎవ్వరూ మరి పెదవి విప్పలేదు. ఆ వైనమే లేదు. ప్లీనరీ సమావేశంలో దేశంపై రంకెలు వేసారు. అవినీతి అన్నారు. ఆ తరువాత మరి ఊసేలేదు. పైగా ఎవరో చెబితే అన్నారు. అంతే తప్ప, తను చేసిన ఆరోపణల మీద, విమర్శల మీద గట్టిగా నిల్చోలేకపోయారు.


ఇంతలో శ్రీరెడ్డి ఇస్యూ వచ్చింది. ఛాంబర్ కు వెళ్లి నానా రంకెలు వేసారు. నానా హడావుడి. అంతు బుస్ కాస్తా తుస్ అయిపోయింది. ఈయన మీద పడిన ఎఫ్ఐఆర్ ఏమయిందో? ఈయనకు మీడియా సంస్థలు వేసిన పరువునష్టం దావాలు ఏమయ్యాయో? ట్విట్టర్ లో చేసిన గత్తర ఏమయిందో? అంతా మాయం. ఆఖరికి ట్విట్టర్ లో కూడా ఆయన ఓ స్టాండ్ నిర్వహించలేకపోయారు. కొద్ది రోజులు పగలు, రాత్రి లేకుండా నానా రకాల ట్వీట్ లు చేసారు. చటుక్కున మారిపోయి, పుస్తకాలు, వాటిల్లో పేజీలు ట్వీట్ లు చేసారు. ఇప్పుడు అదీ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: