అఖిల్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన వర్మ!

Edari Rama Krishna
తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం అక్కినేని నాగార్జున తో ‘ఆఫీసర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఇక నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో అప్పుడే డైరెక్టర్ ఫీల్డ్ లోకి వచ్చిన రాంగోపాల్ వర్మ ‘శివ’ చిత్రాన్ని తీశారు.  ఈ చిత్రం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రభంజనం సృష్టించింది.  ఎంతగా అంటే అప్పటి నుంచి తెలుగు చిత్రాల్లో ఎక్కువగా మాఫియా తరహా చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత లభించింది.

ఇండస్ట్రీలో విలనీజానికి కొత్త భాష్యం చెప్పారు.  ఈ మద్య తన నోటి దురుసుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపణలు సృష్టించిన రాంగోపాల్ వర్మ ‘ఆఫీసర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.  ఇదిలా ఉంటే..ఒకప్పుడు నాగార్జున్ కెరీర్ బిగినింగ్ లో మంచి బ్రేక్ ఇచ్చిన వర్మ తాజాగా ఆయన రెండో తనయుడు అఖిల్ కూడా మంచి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడట.

ఈ విషయాన్ని ఆ మద్య వర్మ ప్రకటించారు. అసలే అఖిల్ కి ఇంతవరకూ సరైన హిట్ పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ సాహసం చేస్తున్నట్టేనని అంతా అనుకున్నారు. ఇదే సమయంలో చోటుచేసుకున్న కొన్ని వివాదాస్పదమైన కారణాల వలన, ఈ ప్రాజెక్టు ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు.

ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న అఖిల్, ఆ తరువాత సినిమాను కొరటాల శివతో చేయవచ్చనే టాక్ నిన్నంతా బలంగా వినిపించింది.  దాంతో అఖిల్ చిత్రం వర్మతో లేనట్లే అని వార్తలు వచ్చాయి. అయితే అఖిల్ తో తన సినిమా ఉందని మరోసారి వర్మ స్పష్టం చేశాడు. ఈ సినిమా గురించి వచ్చే నెలలో మాట్లాడతానని చెప్పాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: