సూర్య ఫెయిల్యూర్ ను అంగీకరించని పవన్ !

Seetha Sailaja
ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘నాపేరు సూర్య’ మరో రెండురోజులు గడిస్తే ఒకవారం పూర్తి చేసుకుంటుంది. ఈమూవీకి డివైడ్ టాక్ వచ్చి కలక్షన్స్ సంతృప్తికరంగా లేకపోయినా ఈమూవీ సక్సస్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అన్నింటా మించి ఆశ్చర్యకరంగా ఈ సక్సస్ మీట్ కు పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చి తనకు బన్నీకి లేటెస్ట్ గా ఏర్పడిన సాన్నిహిత్యాన్ని మరింత ఓపెన్ చేయాలని పవన్ భావిస్తున్నాట్లు తెలుస్తోంది.

గతంలో పవన్ కు మెగా కుటుంబ సభ్యులకు ముఖ్యంగా అల్లు అరవింద్ బన్నీలతో గ్యాప్ ఉన్న నేపధ్యంలో పవన్ మెగా హీరోల సినిమాల ఫంక్షన్స్ కు ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలకు బాగా దూరంగా ఉండేవాడు. అయితే ఈమధ్య మారిన పరిస్థుతులలో పవన్ ఛానల్స్ తో చేసిన యుద్ధానికి అల్లు అర్జున్ కూడ సపోర్ట్ చేయడంతో పవన్ కు బన్నీ పై కూడ విపరీతమైన ప్రేమ పెరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారంమేరకు ‘సూర్య’ సక్సస్ మీట్ రేపు ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఈరోజు సాయంత్రానికి ప్రకటిస్తారు అని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈమూవీకి డివైడ్ టాక్ వచ్చినా ఈమూవీ నాలుగు రోజులకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

కేరళ తమిళనాడు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు ఈమూవీ బాగా నచ్చడంతో పొరుగు రాష్ట్రాలలో ఈమూవీ ఇప్పటి వరకు 10 కోట్ల నెట్ కలక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనితో తమిళ మళయాళ ప్రేక్షులకు బాగా నచ్చిన ‘నాపేరు సూర్య’ తెలుగు ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదు అన్న విషయమై సమాధానం దొరకక అల్లు కాంపౌండ్ అంతర్మధనంలో ఉన్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: