విజయ్ 'డియర్ కామ్రేడ్'.. అర్జున్ రెడ్డి తర్వాత అదే స్టైల్..!

shami
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ మనవాడి కెరియర్ కు ఫుల్ జోష్ అందించింది. వరుసగా ఐదారు సినిమాలకు సైన్ చేశాడు. ప్రస్తుతం విజయ్ నటించిన ట్యాక్సీవాలా రిలీజ్ కు రెడీ అవుతుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా కూడా పూర్తి కావొచ్చింది.


ఇక ఈ రెండు సినిమాలే కాకుండా భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు చేస్తున్న సినిమాలో విజయ్ హీరోగా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా డియర్ కామ్రేడ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ బర్త్ డే నాడు ఆ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.


డియర్ కామ్రేడ్ అంటే ఈ సినిమా కూడా అర్జున్ రెడ్డి తరహాలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. భరత్ ఏ కథతో ఈ సినిమా తీస్తున్నాడా అన్న ఎక్సయిటింగ్ మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఓకే అనిపించగా సినిమా టీజర్ రిలీజ్ అయితే కాని సినిమా అసలు లెక్క తెలుస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో తనకొచ్చిన క్రేజ్ కు విజయ్ తన సినిమా సెలక్షన్ విషయంలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నాడు.


కచ్చితంగా డియర్ కామ్రేడ్ సౌండింగ్ బాగుంది కాబట్టి సినిమా కూడా దానికి తగినట్టుగానే ఉంటుందని అనుకుంటున్నారు. ఈరోజు రిలీజ్ అవుతున్న మహానటి సినిమాలో కూడా విజయ్ నటించడం జరిగింది. సినిమాలో సమంత జర్నలిస్ట్ గా కనిపిస్తుండగా విజయ్ అదే వార్తాపత్రికకు ఫోటోగ్రాఫర్ గా కనిపిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: