పవన్ ను హెచ్చరిస్తున్న ప్రకాష్ రాజ్ !

Seetha Sailaja
ఏవిషయం పై అయినా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఎలాంటి పెద్ద స్థాయిలో ఉన్న వారి పై అయినా తన విమర్శలతో టార్గెట్ చేసే ప్రకాష్ రాజ్ లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కు హెచ్చరికలు ఇచ్చాడు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్యం పై అదేవిధంగా అతడి ‘జనసేన’ పార్టీ అనుసరిస్తున్న విధానాల పై ప్రకాష్ రాజ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి ‘జనసేన’ పార్టీని ఏర్పాటు చేయడం హర్షింప దగ్గ పరిణామం అయినా పవన్ చుట్టూ ప్రస్తుత పరిస్థుతులలో అనేకమంది అవకాశవాదులు అదేవిధంగా స్వార్ధపరులు గుమిగూడుతారు కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో పవన్ రాజకీయపరంగా చాల దెబ్బతినే అవకాసం ఉంది అంటూ పవన్ కు జాగ్రత్తలు చెపుతున్నాడు ప్రకాష్ రాజ్. అంతేకాదు పవన్ చాల ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెపుతూ  రాజకీయాలలో ముక్కు సూటిగా మాట్లాడే మనస్థత్వం ఏమాత్రం పనికిరాదు అని అభిప్రాయపడుతున్నాడు ప్రకాష్ రాజ్.

ఇదే సందర్భంలో ఈ విలక్షణ నటుడు మాట్లాడుతూ ప్రస్తుతానికి తాను ఏరాజకీయ పార్టీలోను చేరలేదని అంటూ భవిష్యత్ లో తాను రాజకీయ పార్టీలను ప్రశ్నించే రాజకీయ నాయకుడుగా ఎదుగుతాను కానీ తాను పవన్ కళ్యాణ్ లా రాజకీయ పార్టీలు పెట్టను అన్న సంకేతాలు ఇస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ కొన్ని సంచలన కామెంట్స్ ఈ ఇంటర్వ్యూలో చేసాడు.   

రాబోతున్న 2019 ఎన్నికలలో మోడీ నేతృత్వంలోని ‘భారతీయ జనతా పార్టీ దక్షినాది రాష్త్రాలలో అనేక చోట్ల ఓడిపోవడమే కాకుండా రానున్న ఎన్నికలలో ఉత్తరాది రాష్ట్రాలలో కూడ భారతీయ జనతా పార్టీ చాల చోట్ల దెబ్బతింటుంది అన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. హిందూ మతం వేరు హిందూ ధర్మం వేరు అన్న విషయం పై క్లారిటీ ఇస్తూ రానున్న ఎన్నికలలో హిందు మత తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న  మోడీ పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల పవన్ సరైన వ్యూహాలు అనుసరించకపోతే పవన్ రాజకీయంగా కోలుకోలేని నష్టాలు కొనితెచ్చుకోవలసిన పరిస్థుతులు రాబోతున్నాయి అంటూ పవన్ కు అనేక జాగ్రత్తలతో కూడిన సలహాలు ఇస్తున్నాడు ప్రకాష్ రాజ్..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: