కీర్తి సురేష్ డార్క్ సీక్రెట్ బయటపెట్టిన డాని సాంచెజ్ !

Seetha Sailaja
‘మహానటి’ మూవీతో కీర్తీ సురేశ్ పేరు మారుమ్రోగిపోతోంది. సావిత్రి పాత్రలో ఆమె జీవించింది అంటూ ప్రముఖ దర్శకుల నుండి సామాన్యుల వరకు ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండటంతో రానున్న రోజులలో ఈ బ్యూటీ దక్షిణాది సినిమా రంగానికి టాప్ హీరోయిన్ గా ఎదిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 

ఇప్పటివరకూ కీర్తి సురేశ్ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ‘మహానటి’ మూవీతో ఆమె రేంజ్ పెరిగిపోవడంతో భవిష్యత్ లో ఆమె తన సినిమాలను ఎంచుకోవడం కష్టమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సావిత్రి రియల్ లైఫ్ పాత్రను అవలీలగా పోషించిన ఈమె నటనా సామర్ధ్యం చూసి ఈమెకు ఈసినిమాతో ఎన్ని అవార్డులు వస్తాయి అన్న అంచనాలు వేస్తున్నారు. 

మహానటి మూవీలో సావిత్రి పాత్రకు జీవం పోసింది కీర్తి అయితే కీర్తీ సురేశ్ ను సావిత్రిగా మలచడంలో హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డాని సాంచెజ్ ప్రతిభ ఎవరూ కాదనలేని విషయం. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంటున్న డాని సాంచెజ్ దర్శకుడు నాగ్ అశ్విన్ వెతికి పట్టుకోవడంలోనే నాగ్ అశ్విన్ సమర్థత కనిపిస్తుంది. 

తెలుగు మాట్లాడటమే కాదు అర్ధం కూడ చేసుకోలేని ఈ సినిమాటోగ్రాఫర్ అచ్చమైన తెలుగు అమ్మాయిగా సావిత్రిగా కీర్తిని చూపించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇలాంటి ప్రతిభగల డాని కీర్తి సురేశ్ గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సీక్రెట్ ను బయట పెట్టాడు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న ప్రతిరోజు ప్రారంభంలో కీర్తి ఉదయాన్నే తన వద్దకు వచ్చి ఒక ‘హగ్’ ఇచ్చి తనను లావుగా చూపించడం మర్చిపోవద్దు అంటూ గుర్తు చేసేదట. ఇలా లావుగా చూపించమని అడిగిన ఏకైక హీరోయిన్ ఒక్క కీర్తి మాత్రమే అంటూ ఆమెకు నటన పట్ల ఉన్న డెడికేషన్ ను అదేవిధంగా సావిత్రి పాత్ర పట్ల ఉన్న కమిట్ మెంట్ ను అందరికీ అర్ధంయ్యేలా తెలియచేసి ఆశ్చర్య పరిచాడు డాని సాంచెజ్.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: