అనసూయ హవా ముందు హీరోయిన్స్ ఏం పనికొస్తారు..!

shami
టాలీవుడ్ హాట్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ జబర్దస్త్ చేస్తూనే జబర్దస్త్ ఫాలోయింగ్ ఏర్పాచుకుంది. ఇక ఆ షో సూపర్ హిట్ అవడంతో అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చాయి. బుల్లితెరను షేక్ చేస్తున్న ఈ భామ సినిమాల్లోనూ రానిస్తుంది. ఈమధ్యనే రంగస్థలంలో రంగమ్మత్తగా ఊపు ఊపేసింది అనసూయ.


బుల్లితెర ఇమేజ్ కు దూరంగా తన పాత్రలను ఎంచుకుంటూ నటన పరంగా కూడా మంచి మార్కులు సాధిస్తున్న అనసూయ బుల్లితెర అభిమానులకు మాత్రం తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా తన స్టైలిష్ లుక్ ను ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పెడుతుంది అమ్మడు.


ఈమధ్య అనసూయ మరింత క్రేజ్ సంపాదించింది ఎంతగా అంటే ఇంచుమించు ఓ స్టార్ హీరోయిన్ కు ఉన్న ఫాలోయింగ్ అన్నమాట. హీరోయిన్ కాకున్నా స్మాల్ స్క్రీన్ పై తన సత్తా చాటుతుండటంతో అమ్మడికి ఈ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం మరో రెండు సినిమా అవకాశాలను అందుకుంది అనసూయ.


అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమాలో క్రేజీ రోల్ పట్టేసిందట. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేహ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ లో అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది అంటే అనసూయ హవా ఏ రేంజ్ లో ఉందో ఊహించవచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్న అనసూయ చూస్తుంటే హీరోయిన్ గా చేసినా చేస్తుందని అంటున్నారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: