ప్రభాస్ అనుష్కల వీడియో కాల్స్ పై ఆంగ్ల దినపత్రిక ఆసక్తికర కధనం !

Seetha Sailaja
‘బాహుబలి’ తో ప్రభాస్ నేషనల్ సెలిబ్రిటీగా మారిపోవడంతో ప్రభాస్ పై తరుచు ఏదో ఒక న్యూస్ రాయకుండా జాతీయ మీడియా ఉండలేక పోతోంది. ఇలాంటి పరిస్థితుల మేపధ్యంలో ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ప్రభాస్ అనుష్కల వీడియొ కాల్స్ పై ఒక ఆసక్తికర కధనాన్ని ప్రచురించినట్లు వార్తలు వస్తున్నాయి.   

ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కొత్త విషయం కాకపోయినా అయితే తమ మధ్య అలాంటి బంధం లేదని తమ మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమే అంటూ ఆమధ్య ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఆతరువాత వీరిద్దరి పై గాసిప్పులు బాగా తగ్గాయి. 

అయితే లేటెస్ట్ గా అనుష్క తీర్ధయాత్రలు చేస్తూ దేవాలయాల చుట్టూ తిరిగిన తరువాత ఈమధ్య అనుష్క దుబాయ్ వెళ్లి ‘సాహో’ షూటింగ్ ను కొన్నిరోజులు చూసినట్లు వార్తలు వినిపించాయి. దీనితో మళ్ళీ వీరిద్దరి ప్రేమ పెళ్లి వ్యవహారం పై వార్తలు ఊపు అందుకున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ దుబాయ్‌ లో ఉంటే అనుష్క రెగ్యులర్‌ గా వీడియో కాల్స్‌ చేస్తూ టచ్‌ లోనే ఉంది అంటూ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది అని తెలియడంతో తిరిగి వీరి ప్రేమ వ్యవహారం స్పీడ్ పెరిగిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

కొద్ది కాలంక్రితం ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఈ ఏడాది ప్రభాస్ పెళ్ళి గురించి ఒక క్లారిటీ ఇస్తాను అని అనడం ఆతరువాత ‘భాగమతి’ విడుదల తరువాత అనుష్క తనకు ఎన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరించడంతో వీరిద్దరి మధ్య ఇంకా ఎదో జరుగుతోంది అన్న సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ సన్నిహితులు మాత్రం ఈవార్తలు అన్నీ ప్రభాస్ కు ఉన్న నేషనల్ స్టార్ ఇమేజ్ ని దెబ్బకొట్టడానికి కొందరు వ్యూహాత్మకంగా చేస్తున్న ఎత్తుగడలు అంటూ ఈ లేటెస్ట్ న్యూస్ ను గాలి వార్తగా కొట్టేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: