మహానటి కుమార్తె వింత ప్రవర్తన పై ప్రముఖ పత్రిక ఆసక్తికర కథనం !

Seetha Sailaja
‘మహానటి’ సావిత్రి జీవితం మరువలేని చరిత్ర అంటూ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను షేక్ చేస్తున్న సావిత్రి జీవితం పై తీసిన ‘మహానటి’ సినిమాలోని తప్పులను ఎత్తి చూపుతూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఈరోజు ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ‘మాయాబజార్’ షూటింగ్ లో ‘నీకోసమే నే జీవించినది’ పాట చిత్రీకరణ సమయంలో గ్లిజరిన్ లేకుండానే కేవలం రెండు కన్నీటి బొట్లు కార్చేలా నటించింది అన్నది అందమైన అబద్ధం అంటూ ఆ పత్రిక కామెంట్ చేసింది. 

అదేవిధంగా సావిత్రికి ‘పద్మశ్రీ’ అవార్డు వస్తే తన భర్త జెమిని గణేషన్ బాధపడతాడని ఆ అవార్డు సావిత్రి తిరస్కరించింది అని చూపించిన విషయం కూడ పచ్చి అబద్ధమని ఆపత్రిక వార్తా కథనంలో పేర్కొంది. ఇక ముఖ్యంగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ప్రవర్తన పై కూడ కొన్ని షాకింగ్ వార్తలు ఆపత్రిక కథనంలో కనిపిస్తాయి. 

సావిత్రి కోమాలో ఉండగా ఆమె గదిలోని బీరువాలు పగలుగొట్టి లక్షలు విలువైన నగలను దోచుకుపోయారని విజయ చాముండేశ్వరి సావిత్రి మరణించిన వెంటనే ‘మాఅమ్మ ఆస్థిని దొంగిలించింది ఎవరు’ అంటూ అప్పట్లో పత్రికా సమావేశం పెట్టి సావిత్రి కుమార్తె చేసిన హడవిడిని కూడ ప్రముఖంగా ఆపత్రిక ప్రచురించింది. అదేవిధంగా సావిత్రి చివరి దశలో ఉండగా తన కన్న తల్లి పై విజయ చాముండేశ్వరి కేసు పట్టిన విషయాన్ని జెమిని గణేషన్ బాహాటంగా పత్రికల ముందు చెప్పిన విషయాలు కూడ ఆ పత్రిక కథనంలో కనిపిస్తాయి. 

అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు విజయ చాముండేశ్వరి తన తండ్రి చాల మంచివాడు అంటూ అనేక ఇంటర్వ్యూలలో చెపుతున్న తీరు అందరికీ ఆశ్చర్యకరం అంటూ ఆపత్రిక కథనం కామెంట్ చేసింది. అంతేకాదు సావిత్రి పుట్టిన తేదీ దగ్గర నుండి ఆమె నటించిన సినిమాల సంఖ్య వరకు చాల విషయాలలో అసత్యాలు ఉన్నాయి అంటూ ఈచిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుకుని తీసి ఉంటే జాతీయ స్థాయి అవార్డుకు అర్హత పొందే సినిమాగా ‘మహానటి’ మారి ఉండేది అంటూ ‘ఏది సత్యం ఏది అసత్యం’ వార్తా కథనంలో ఆపత్రిక అనేక విషయాలను సావిత్రి జీవితం పై చర్చించింది..
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: