నేనూ ప్రేమిస్తాను..!

Edari Rama Krishna
తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ.  గత కొంత కాలంగా మనోడు తీస్తున్న సినిమాలు ఏవీ హిట్ కాలేదు..కదా అసలు ఆ సినిమాలు థియేటర్లకు ఎప్పుడు వచ్చాయో అన్న సంగతి కూడా తెలియని పరిస్థితి.  దేశంలో ఏదైనా పెద్ద సమస్యలు వస్తే దానిపై ఓ చిత్రం తెరకెక్కిస్తున్నా అంటూ..యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంటారు.  ఆ మద్య ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పిన వర్మ ఆ సంగతి పక్కనబెట్టారు. ఆ తర్వాత జీఎస్టీ చిత్రంతో మరో సంచలనం సృష్టించారు. 

ఇక కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డిని తెగ మెచ్చుకుంటూ..పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయమని తానే చెప్పానని ఓ వీడియో విడుదల చేసిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనాలే జరిగాయి.  ఇవన్నీ ఒక ఎత్తైతే ఎప్పుడూ సోషల్ మాద్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ కాంట్రవర్సీలు సృష్టిస్తూ వస్తున్నారు.

తాజాగా తనలో కూడా ప్రేమ ఉందని ట్విట్టర్‌లో తాజాగా పెట్టిన ఓ ఫోటో ద్వారా వెల్లడించాడు. ఒక కుక్క పిల్లతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ 'నేను కూడా ప్రేమిస్తాను' అంటూ కామెంట్ పెట్టాడు. మరి ఈ సారి ఎవరిని ఉద్దేశించి.. ఇలాంటి పోస్టు పెట్టాడో ఆయనకే తెలియాలి. ఎప్పుడూ ప్రముఖులపై విమర్శలు చేయడం, వారి అభిమానుల నుంచి ప్రతివిమర్శలు ఎదుర్కోవడం వర్మ అలవాటుగా చేసుకున్నాడు.

తాజా పోస్టుపై నెటిజన్ల నుంచి ఎలాంటి కామెంట్లు వస్తాయో చూడాలి మరి. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటించిన ‘ఆఫీసర్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
I too can love 😍 pic.twitter.com/7MTDFx2NAJ

— Ram Gopal Varma (@RGVzoomin) May 18, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: