పైకే చూడండి కింద చూశారో అంతే సంగతులు..!

shami
జబర్దస్త్ ఫేం రష్మి గౌతం ఓ పక్క సిల్వర్ స్క్రీన్ పై అందాల విందుతో పాటుగా స్మాల్ స్క్రీన్ పై వచ్చి రాని తెలుగుతో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్ షోతో సూపర్ పాపులారిటీ సంపాదించిన రష్మి ఆ షోలో యాంకర్ గా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రష్మి ఓ క్రేజీ ట్వీట్ చేసింది.


వచ్చిన ఏ అవకాశాన్ని వదలని ఈ అమ్మడు కరెంటు సినిమా టైం లోనే హీరోయిన్ పక్కన పాత్రలో నటించింది. అయితే అప్పుడు సరిగా అవకాశాలు రాకపోయే సరికి చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకుంది. ఇక ఎప్పుడైతే జబర్దస్త్ అమ్మడు చేతికి వచ్చిందో అప్పటి నుండి కెరియర్ లో సూపర్ స్పీడ్ అందుకుంది.


Don't look down and be depressed.
look up and you will be blessed @mallemalatv @etvteluguindia @WeNitinBharath #extraJabardast pic.twitter.com/tvzLeq6sfV

— rashmi gautam (@rashmigautam27) May 18, 2018
ఈ షో చేస్తూనే గుంటూర్ టాకీస్ అంటూ ఓ హాట్ మూవీని చేసింది. ఆ సినిమా టాక్ ఎలా ఉన్నా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది మాత్రం కేవలం రష్మి వల్లనే. ఆ సినిమా తర్వాత అమ్మడికి అలాంటి ఆఫర్లు అరడజను పైగా వచ్చాయి. అన్ని అలాంటి సినిమాలనే చేస్తూ కాస్త డబ్బులు వెనుకేసుకుంది రష్మి.


అంతేకాదు జబర్దస్త్ షో ద్వారా కూడా మంచి స్థాయికి వచ్చింది. 10 వేల రెమ్యునరేషన్ నుండి ఇప్పుడు లక్షల రెమ్యునరేషన్ దాకా వెళ్లిందంటే రష్మి సాధించిన వీజయం ఏంటో అర్ధమవుతుంది. ఇక ఇన్నేళ్ల జబర్దస్త్ కెరియర్ ను గుర్తుచేసుకుంటూ కింద్రకు చూడొద్దు డిప్రెషన్ లోకి వెళ్తారు.. పైకి మాత్రమే చూడండి ఆశీర్వదించబడతారు అంటూ ఓ ట్వీట్ చేసింది. కష్టాల సమయంలో కింద్రకు చూసి డిప్రెషన్ అవకుండా కెరియర్ మునుముందు ఇంకా పై స్థాయిలో ఉంటుందనే ఉద్దేశంతో ఉత్సాహబరితమైన ట్వీట్ చేసింది రష్మి.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: