సినియర్ నటులు మాదాల రంగారావు పరిస్థితి విషమం!

siri Madhukar
ఈ మద్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  విప్లవాత్మక సినిమాలు తీసి ‘రెడ్ స్టార్’ గుర్తింపు పొందిన నటుడు, నిర్మాత మాదాల రంగారావు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  నివారం సాయంత్రం శ్వాసకోశ సమస్యతో రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వెంటనే ఆయన్ని స్టార్ హాస్పిటల్‌లో చేర్పించామని ప్రకటనలో పేర్కొన్నారు. గత సంవత్సరం మే నెలలో నాన్నగారికి తీవ్ర గుండెపోటు వచ్చింది.

వెంటనే చెన్నైలోని విజయ హాస్పిటల్‌లో చేర్పించాం. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చాం. డాక్టర్ గోపీచంద్, ఆయన బృందం గుండె శస్త్రచికిత్స చేసి నాన్నగారిని కాపాడారు. అప్పటి నుంచి నాన్నగారు హైదరాబాద్‌లోనే డాక్టర్ రమేష్, డాక్టర్ గోపీచంద్, డాక్టర్ అనురాధ పర్యవేక్షణలో నా వద్దనే ఉంటున్నారు. ఈ మేరకు ఆయన కుమారుడు మాదాల రవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. 

గత ఏడాది తీవ్ర అనారోగ్యానికి గురైన మాదాల రంగారావుకు స్టార్‌ హాస్పిటల్‌ వైద్యులు చికిత్స చేశారు. కాగా, 1980ల్లో విప్లవాత్మక సినిమాల్లో నటించడంతోపాటు ఎర్ర చిత్రాలను నిర్మించడం ద్వారా మాదాల రంగారావు ‘రెడ్ స్టార్’గా బాగా పాపులర్ అయ్యారు.

తెలుగు సెటైరికల్ చిత్రం ‘చైర్మన్ చెలమయ్య’ సినిమా ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన రంగారావు.. ఆ తర్వాత ‘నవతరం పిక్చర్స్’ అనే బ్యానర్‌ను స్థాపించారు. తాను నటిస్తూ సొంత బ్యానర్‌లో సినిమాలు నిర్మించారు. ‘యువతరం కదిలింది’, ‘ఎర్ర మల్లెలు’, ‘మహాప్రస్థానం’, ‘ప్రజాశక్తి’, ‘వీరభద్రుడు’, ‘స్వరాజ్యం’, ‘మరో కురుక్షేత్రం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్ర పావురాలు’ వంటి చిత్రాల ద్వారా రంగారావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ కమ్యూనిస్టీ పార్టీ, ప్రజా నాట్యమండలితో కలసి పనిచేశారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: