మెగా మ్యానియాను దూరం పెట్టిన సాయి ధరమ్ తేజ్ !

Seetha Sailaja
మెగా మేనల్లుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పరాజయాల బాటలో ఉన్న సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ మూవీల విషయంలో మెగా మ్యానియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పటి చిరంజీవిలా ఉంటాడు అని గతంలో తన పై కామెంట్స్ రావడంతో రెచ్చిపోయి తన సినిమాలలో చిరంజీవి పాటల రీమిక్స్ లను మితిమీరి చేసిన తేజ్ ఇప్పుడు చిరంజీవి పాటల పేరు చెపితే అధిరిపోతున్నట్లు సమాచారం. 

దీనికి కారణం 'ఇంటిలిజెంట్‌' సినిమాలో చిరంజీవి ‘చమక్‌ చమక్‌ చాం’ పాటని ఖూనీ చేయడంతో తేజ్ వ్యవహార శైలికి ఓపెన్ గానే విమర్శలు వచ్చాయి. దీనితో తన సినిమాలలో ఇకపై చిరంజీవి పవన్‌కళ్యాణ్‌ రిఫరెన్సులు తనకు వద్దని అసలు తన సినిమాలలో మెగా హీరోల ప్రస్తావన అసలు తేవద్దని సాయి ధరమ్ తేజ్ ఓపెన్ గానే చెపుతున్నట్లు సమాచారం.  

దీనితో కరుణాకరన్‌ డైరెక్షన్‌ లో లేటెస్ట్ గా ఈ హీరో నటిస్తున్న 'తేజ్‌' మూవీలో కానీ ఆతర్వాత కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో త్వరలో మొదలుపెట్టబోయే సినిమాలో ఎలాంటి మెగా రిఫరెన్సులు లేకుండా ఈమెగా మేనల్లుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే కథల ఎంపిక విషయంలో తేజ్ అనుసరిస్తున్న వ్యూహాలు లేటెస్ట్ ట్రెండ్ కు సరిపోయేలా లేకపోవడంతో ఈ యంగ్ హీరోకు వరస పరాజయాలు వస్తున్నాయి అన్న కామెంట్స్ ఉన్నాయి. 

దీనికితోడు ఈమెగా యంగ్ హీరోకు ఆశించిన స్థాయిలో మెగా కాంపౌండ్ నుండి సపోర్ట్ రాకపోవడంతో టాప్ డైరెక్టర్స్ ఎవరు తేజ్ తో సినిమాలు తీయడానికి ఆసక్తి కనపరచడం లేదు. ఈపరిస్తుతులలో త్వరలో విడుదల కాబోతున్న ‘తేజ్’ మూవీ కూడ ఫెయిల్ అయితే ఈమెగా యంగ్ హీరో కెరియర్ విపరీతమైన సమస్యలలో చిక్కుకుంటుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: