అరవింద సమేత పై త్రివిక్రమ్ అసంతృప్తి ?

Seetha Sailaja
మాటల మాంత్రికుడిగా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకసారి కథ ఫైనల్ చేసాడు అంటే ఆ మూవీ నిర్మాణ విషయంలో మోనార్క్ లా వ్యహరిస్తాడు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి.  తాను దర్శకత్వం వహించే సినిమాల ప్రారంభోత్సవ ముహుర్తాల నుండి సినిమా టైటిల్ నిర్ణయం వరకు ప్రతి విషయంలోను తన మాట చెల్లుబాటు అయ్యే విధంగా త్రివిక్రమ్ నిర్ణయాలు ఉంటాయి అని అతడి సన్నిహితులు అంటూ ఉంటారు.

దీనితో త్రివిక్రమ్ సినిమాలో నటించే హీరోల దగ్గర నుంచి నిర్మాతల వరకు త్రివిక్రమ్ వ్యవహార శైలిని ప్రశ్నించే సాహసం చేసిన సందర్భాలు గతంలో ఏమిలేవు. అయితే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా విషయంలో ఈపరిస్థితి అంతా తారుమారు అయింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.   ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీస్తున్న  సినిమాకు తన కథ స్టైల్ లో కథ చెపితే జూనియర్ కలగ చేసుకుని ఈమూవీ విషయంలో ప్రవర్తించడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ జూనియర్ తో తీస్తున్న కథ కొరటాల శివ మూవీ స్టైల్ లో తయారైందని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

అంతేకాదు ఈమూవీ షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ చెప్పిన ప్రతి విషయానికీ ఎన్టీఆర్ మార్పులు చెపుతున్న నేపధ్యంలో వీరిద్దరి మధ్యా తరుచు డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. అదేవిధంగా త్రివిక్రమ్ ఈమూవీకి ‘అరవింద సమేత’ అన్న టైటిల్ తో సరిపెడదామని ఎంత చెప్పినా జూనియర్ అంగీకరించకపోవడంతో ఈ టైటిల్ కు వీరరాఘవ అన్న పదాలు చేర్చినట్లు సమాచారం. 

ఈమూవీకి సంబంధించి కేవలం ఒక క్లాస్ టచ్ తో ఫస్ట్ లుక్ విడుదల చేసి సరిపెడదాము అనుకుంటే ఆ ఫస్ట్ లుక్ ను మాస్ లుక్ గా మార్చింది కూడ జూనియర్ సలహాలే అని అంటున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ జూనియర్ త్రివిక్రమ్ ల మధ్య కనిపించని గ్యాప్ క్రియేట్ చేస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చివరకు రిజల్ట్ దగ్గరకు వచ్చే సరికి తనకు మరొకసారి చెడ్డ పేరును తెచ్చి పెడుతుందా అన్న టెన్షన్ లో త్రివిక్రమ్ తన బాధను బయట పడనివ్వకుండా గంభీరంగా ఈసినిమా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: