వచ్చే ఎన్నికల నాటికి బాబు అమలు చేస్తున్న 'ఆ' వ్యూహం ఫలించేనా ...!

Prathap Kaluva

చంద్ర బాబు నాయుడు అనేక నవ నిర్మాణ దీక్షలు. మహానాడులు ఎన్ని చేసిన తన గోల్ మాత్రం  తప్పులన్నిటిని బీజేపీ మీద తోసేసి, ప్రత్యేక హోదా విషయం లో మోడీ ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటివరకు ప్రత్యేక హోదా అస్సలు అవసరం లేదని చెప్పిన బాబు ఇప్పడూ మాత్రం మోడీ ఇవ్వలేదు. ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసినాడు అని బీజేపీ మీద విరుచుకు పడుతున్నాడు. 


ప్రత్యేకహోదా అవసరం లేదు, ప్రత్యేకహోదాతో ఏమీ రాదు, ప్రత్యేకహోదా సంజీవని కాదు.. తనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్లు ఎవరూ లేరన్నదీ, ప్రత్యేకహోదా అంటే జైలుకు పంపుతా అని హెచ్చరించినది.. అంతా మరిచిపోయారు, మరిచిపోయి ఉంటారు.. మరిచిపోవాలి.. అనేది చంద్రబాబు కోరిక. ఆయనతే నిన్నటిని గుర్తు పెట్టుకోరు. నిన్న తను ఏం మాట్లాడినా.. రేపు మళ్లీ ఏం మాట్లాడినా.. ఈరోజు తను మాట్లాడేదాన్నే అంతా నిజం అనుకోవాలి అనేది చంద్రబాబు కోరిక.


దీక్షలు, ధర్నాలు, సభలు, సమావేశాలు అంటూ చంద్రబాబు ఇదే ప్రదర్శన చేస్తున్నాడు. ఇదైతే నిస్సిగ్గు ప్రదర్శనే. ఇందులో సందేహం ఏమీ లేదు. అయితే ఈ నిస్సిగ్గు తనానికి ప్రజల మద్దతు లభిస్తుందా? చంద్రబాబు చెబుతున్న కళ్లబొల్లి మాటలు వింటూ జనాలు ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారా? పరమ అవకాశవాదిలా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు ప్రజలు మరో అవకాశాన్ని ఇస్తారా? బాబుదైతే నిస్సందేహమైన అవకాశవాదం.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: