శిరీష్ గురించి బన్నీ ఎమోషన్ ట్వీట్!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.   ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత దేశముదురు, బన్ని, ఆర్య చిత్రాలతో దుమ్మురేపాడు.   వరుసగా విజయాలు సాధిస్తూ స్టైలిష్ స్టార్ గా మెగా అభిమానులు పిలుస్తున్నారు.  అల్లు అర్జున్ నటించి ‘నా పేరు సూర్య’ చిత్రం మంచి కలెక్షన్లు సాధించింది.  అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ‘గౌరవం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు..తర్వాత మారుతి దర్శకత్వంలో ‘కొత్త జంట’ మంచి సక్సెస్ సాధించింది. 

కానీ శిరీష్ మాత్రం హీరోగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.  నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్యామిలితో కలిసి శిరీష్ జన్మదినాన్ని ముచ్చటగా జరుపుకొన్నారు.  నా జీవితంలో మొదటి చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ పిల్లాడు నా కళ్లముందే పెరిగి పెద్దయ్యాడు. నా జీవితంలో మధురమైన అనుభవాలు, సీక్రెట్స్ అతడితో పంచుకొన్నాను. నా చిన్నారి తమ్ముడు సిరి.. జన్మదిన శుభాకాంక్షలు అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్, తన సతీమణి స్నేహారెడ్డి, కూతురు, కుమారుడితో కలిసి అల్లు శిరీష్ కేక్ కట్ చేశారు. ఈ ఫోటోను అల్లు అర్జున్ షేర్ చేశారు. దాంతో ఈ ఫోటో వైరల్ అయింది. సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ నా కెరీర్‌లోనూ, జీవితంలోనూ నాన్న, అన్నయ్యలదే కీలకపాత్ర. నా సినిమాల విషయంలో, జీవితంలో ఏదైనా సందేహం ఏర్పడినప్పుడు వారిద్దరి సలహాలు తీసుకొంటాను. స్క్రిప్టులు, కథల గురించి వారితో చర్చిస్తాను అని అల్లు శిరీష్ తెలిపారు.
Happy Birthday Day to the 1st Baby in my Life . The baby who grew in front of my eyes from the beginning of my time . The one with whom I shared the maximum amounts of memories & secrets 😉. My Baby Brother Siri . Happy Birthday 😘🎂. @AlluSirish pic.twitter.com/2EntnQXe6Y

— Allu Arjun (@alluarjun) May 30, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: