వైజాగ్ రోడ్లు సూపర్ : రాజమౌళి

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని ధీరుడు ప్రముఖ దర్శకులు రాజమౌళి ఇప్పటి వరకు తీసి చిత్రాలు ఏ ఓక్కటీ ఫ్లాప్ కాలేదు.  అంతే కాదు ఈయన దర్శకత్వంలో ఏ హీరో నటించిన మంచి క్రేజ్ వస్తుందన్న నమ్మకం హీరోలకు ఉంటుంది.  అందుకే ఇండస్ట్రీలో రాజమౌళిని జక్కన్న అంటారు. ఇప్పటి వరకు స్టార్ హీరోలతోనే కాదు నాని, నితిన్ లాంటి హీరోలతో చిత్రాలు తెరకెక్కించి అద్భుత విజయం సాధించారు. 

ఇక బాహుబలి, బాహుబలి 2 లాంటి అద్భుతమైన చిత్రాలు తీసి తెలుగు వాడి ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు.  ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన బాహుబలి 2 జక్కన్న పుణ్యమే అనొచ్చు.   ప్రస్తుతం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌తో కలిసి మల్టీస్టారర్ సినిమా రూపొందించే ఏర్పాట్లలో బిజీగా ఉన్న దర్శక ధీరుడు రాజమౌళి. తాజాగా రాజమౌళి విశాఖ పట్నం వెళ్లారు..అక్కడి రోడ్ల పరిశుభ్రత చూసి ఆశ్చర్యపోయారు..ఇంత పచ్చదనం..పరిశుభ్రత చాలా బాగుందని..అధికారుల పనితీరును ప్రశంసిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

చాలా కాలం తరువాత తనకు విశాఖపట్నం రోడ్లను చూసే అవకాశం వచ్చిందని, చాలా శుభ్రంగా ఉన్నాయని, అలాగే, ఆ పరిసరాల్లో అంతా పచ్చదనం కనపడుతోందని, అధికారులు సమర్థవంతంగా పనులు నిర్వహిస్తున్నారని ట్వీట్ చేశారు. దేశంలో అన్ని ప్రాంతాలు ఇలాగే ఉంటే..అభివృద్ది ఎంత గొప్పగా ఉందో ఇట్టే తెలిసిపోతుందని అన్నారు.  విశాఖ పరిసరాలను అద్భుతంగా తీర్చిదిద్దిన విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్‌ అధికారులకు అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
Had a chance to observe Vizag roads after a long time. Quite clean, green and efficiently done. Appreciate VUDA for a splendid job.

— rajamouli ss (@ssrajamouli) May 30, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: