నా సీనీ కెరీర్ ఎన్నో కష్టాలతో నడిచింది : నాగార్జున

siri Madhukar
టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున మొదట్లో కెరీర్ పెద్దగా సాగలేదు.  రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ఘన విజయం సాధించింది.  అప్పటి నుంచి నాగార్జున వరుస విజయాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.  తర్వాత రొమాంటిక్ హీరోగా మన్మధుడు, కింగ్ నాగార్జునగా పేరు తెచ్చుకున్నారు.  చాలా కాలం తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఆపీసర్’ సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. 

ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది..ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్.  తాజాగా నాగార్జున్ మాట్లాడుతూ..తన సినీ ప్రయాణం అంతా రిస్కులతో సాగిందని, ప్రతి సినిమాకు టెన్షన్ ఉంటుందన్న నాగ్.. దానిని వదిలించుకోకపోతే జుట్టు ఊడిపోతుందని చమత్కరించారు. విజయాల్లేని వర్మకు స్టార్ హీరోలు డేట్లు ఇవ్వడానికి భయపడుతుంటే మీరెలా నమ్మి, ఇచ్చారన్న ప్రశ్నకు నాగార్జున పై విధంగా సమాధానం చెప్పారు.

ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల ఎమోషన్ తనను కట్టి పడేసిందని, సినిమా అంగీకరించడానికి అదే కారణమని అన్నారు. వర్మ సినిమాలు బాగా తీస్తాడని, ముక్కు సూటితనం, నిజాయతీ, వ్యవస్థపై గౌరవం ఉండే శివాజీరావు అనే పోలీస్ ఆఫీసర్ కథ ఇది అని వివరించారు.

సినిమా విషయంలో వర్మకు ఎటువంటి షరతులు విధించలేదని, కాకపోతే తనలోని నైపుణ్యాలన్నింటినీ వాడుకోమన్నానని చెప్పానని, అది షరతు కాదని అన్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకే భరోసా లేదని, ఇక వారి పిల్లలకు ఎక్కడుంటుందని, ఎవరైనా కష్టపడాల్సిందేనని నాగ్ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: