బోయయపాటి సలహాకు షాక్ అయిన చిరంజీవి !

Seetha Sailaja
‘రంగస్థలం’ సూపర్ సక్సస్ తరువాత బోయపాటి మూవీలో నటిస్తున్న చరణ్ ఈమధ్య తన షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి తన భార్య ఉపాసనతో కలిసి ప్రస్తుతం ప్యారిస్ లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ హాలిడేస్ నుంచి తరిగి వచ్చాక చరణ్ ఈసినిమాకు సంబంధించి రాజస్థాన్ ఎడారుల్లో తీయబోయే కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ లో పాల్గోనబోతున్నట్లు సమాచారం. 

ఇప్పటికే ఈమూవీకి సంబంధించి ‘రంగస్థలం’ సూపర్ సక్సస్ తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న బోయపాటి ఈమూవీకి విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఒక షాకింగ్ టైటిల్ ఆలోచించి ఆ టైటిల్ కు అనుమతి ఇవ్వవలసిందిగా చిరంజీవిని అడిగినట్లు టాక్. చిరంజీవి కెరియర్ లోనే టాప్ ఫిలింగా పేరుగాంచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ టైటిల్ ను బ్రేక్ చేసి బోయపాటి తన మూవీకి ‘జగదేకవీరుడు’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈసినిమా కథ అంతా ఒక రాయల్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే నేపధ్యంలో మొదట్లో బోయపాటి ఈమూవీకి ‘రాజ మార్తాండ’ అన్న టైటిల్ పెట్టాలని భావించాడు. అయితే ఆ టైటిల్ కంటే మెగా అభిమానులకు చాల సులువుగా కనెక్ట్ అయ్యే ‘జగదేక వీరుడు’ టైటిల్ బాగుంటుందని బోయపాటి అభిప్రాయం అని అంటున్నారు. అయితే ఇలాంటి క్లాసిక్ టైటిల్ కు చిరంజీవిని ఎలా ఒప్పించాలి అన్న టెన్షన్ లో బోయపాటి ఉన్నట్లు సమాచారం. 

రాబోతున్న దసరాను టార్గెట్ చేస్తూ అత్యంత భారీ అంచనాలతో నిర్మింపబడుతున్న ఈమూవీలో కనీవినీ ఎరుగని యాక్షన్ సీన్స్ ఉంటాయి అని అంటున్నారు. చరణ్ డిఫరెంట్ లుక్ లో ఈమూవీలో బోయపాటి చూపించబోతున్నాడు. ఈవిషయాలకు మరింత క్రేజ్ ను పెంచేలా ‘జగదేకవీరుడు’ టైటిల్ కు చిరంజీవి ఒకే చెపితే మరో సంచలనం చరణ్ అభిమానులకు త్వరలోనే ఉండబోతోంది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: