స్వీటీ ప్రభాస్ పెళ్ళి చేసుకుంటే జోడియాక్-సైన్ ప్రకారం లైఫ్ బాగుంటుందా? లిండా గుడ్మాన్

 

ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కురాలు లిండా గుడ్మాన్ న్యూయార్క్ టయింస్


గత సంవత్సరం బాహుబలి అద్భుత విజయం సాధించటానికి అందులో నటించిన నాయకీ నాయకుల పాత్ర మహోన్నతం. వారిరువురి వ్యక్తిగత నటనకు పొగడ్తలేకాదు కీర్తి ప్రతిష్ఠలు తారస్థాయిలో అందించారు ప్రేక్షకులు. చూపరులను కట్టిపడేసే నిలువెత్తు సౌందర్యంతో ఆమె, అద్భుతమైన విశాల బాహువులతో అతడు – మనకి వెండితెరపై ముచ్చటైన జంటగా కనువిందు చేశారు. ఆహా! అనిపించే జంటను చూసిన అందరూ ఆ సౌందర్యానికి ముగ్ధులవటమే-వారు కాదన్నా మేం స్నెహితులం  మాత్రమేనని చెప్పినా వినకుండావాళ్ళు ప్రేమలో ఉన్నారని”-  బలవంతంగా వాళ్లని ప్రేమలోకి లాగేసి - పుకార్లు పుట్టటానికి కారణం.




మేము మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పినా, వారి అభిమానులు మాత్రం వారు కలిసే జీవిస్తున్నారని నిశ్చయం చేసేసుకున్నారు. చివరకు వాళ్ళు మా మద్య మీరనుకునే సంభంద మేమీ లేదని పలుమార్లు గట్టిగా చెప్పినా వారి వివాహానికి సంబందించిన పుకార్లు ఆగట్లేదు. 


అందుకే ‘బాలీవుడ్ లైఫ్ వెబ్సైట్ ‘ కు చెందిన అంకితా చౌరాసియా – వాళ్ళ జోడియాక్ సైన్స్ (జన్మ నక్షత్రాలు) ప్రకారం వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది – ఒకవేళ అభిమానులని మన్నించో, అసలు వీళ్ళకే ప్రేమ పుట్టి పెళ్ళి చేసుకుంటే, వారి జీవిత సానుకూలత కోసం ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కురాలు లిండా గుడ్మాన్ ను సంప్రదించారు.

ఆమె చెప్పిందేమంటే:


ప్రభాస్ అక్టోబర్ 23, అనుష్క నవంబర్ 7, న జన్మించారు. వారి జోడియాక్ సైన్ ఒకటే అదే స్కార్పియో (వృచ్చికం). మనం కొంచం ఈ నక్షత్రం గురించి అర్ధం చేసుకుందాం!


స్కార్పియోస్ వారి గురించి వారికి బాగా తెలుసు. ఏవరేమి చెప్పినా వారిని మార్చలేరు. అంటే వారి జ్ఞానంపై సలహాల ప్రభావం ఏమాత్రం ఉండదు. వాళ్ళ వెనక పరుల తెగడ్తలు, వారిముందు ఇతరుల పొగడ్తలు, రెండూ కూడా వారిని ఒక మిల్లీమీటరు కూడా కదిలించలేవు.


మన ధర్మపన్నాలు హితబోధలు సలహాలు వారికేమాత్రం అవసరం లేదు. మహా ఐతే వారు మన పరిశీలన, విశ్లేషణలను అంగీకరించినట్లు నటిస్తారు! లేదా మన ఉద్దేశాలను పసిగట్టకలరు కూడా!

స్కార్పియో పురుషుని స్వభావం


అభిరుచి పై మక్కువ అనేది స్కార్పియో పురుషుని స్వభావం. వారి మనసుకు నచ్చిన దేనిపై నైనా మక్కువ పెంచుకుంటారు శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళ కిస్థమైతే 100% సాధిస్తారు. ఉనికిలో  లేనిదాన్నైనా సంపాదించటానికైనా సిద్ధమే. అంటే పచ్చిగా చెప్పాలంటే శూన్యంలోనైనా చేపలి పట్టగలరు. తిమిరి ఇసుమున తైలంబు తీయవచ్చు టైపు ….


ప్రభాస్ అభిరుచి మనకు అర్ధమౌతూనే ఉంది. ఆయన చాలా క్రింద నుండి తన వృత్తినే ప్రవృత్తి చేసుకొని వైకుంటపాళి లోని నిచ్చెన మెట్లెక్కుతూ నింగికి చేరుకున్నారు. అది వృచ్చిక స్వభావమే. తన కృషితో రాత్రికి రాత్రి ఒక ప్రాంతీయ భాషా కథానాయకుని స్థాయి నుండి ఒక జాతీయ  అంతర్జాతీయ సంచలనంగా ఎలా మారింది మనకు కళ్ళకు కట్టినట్లు తెలుస్తూనే ఉందని అంటారు లిండా.


ప్రభాస్  వ్యక్తిగత జీవితం గుఱించి మనకు తెలియకపోయినా ఒక స్కార్పియో పురుషునికి తనకు నచ్చిన వారిపై ప్రేమ అనంతం వర్ణించలేనంత. స్కార్పియో పురుషుడు తన చుట్టుపక్కల ఉండేవారిపై,  బంధువులు స్నేహితులు అభిమానులపై చూపెట్టే  ప్రేమ, శ్రద్ధ గమనిస్తేచాలు వారెంత ప్రేమాస్పదుడో?  తెలుస్తుందని అంటారు లిండా.

స్కార్పియో స్త్రీ స్వభావం


ఒక స్కార్పియో స్త్రీ ని ఒకే ఒక మాటలో వర్ణించమంటే “అయస్కాంతం”అని చెప్పొచ్చు.  ఆమె ఒక అంతుబట్టని, బయటకు మాటల్లో చెప్పలేని అద్భుతం. ఆ అద్భుతాన్ని చేధించటానికి చాలా కాలం కాదు యుగాలు పట్టొచ్చు. కాని ఒక్క సారి ఆ అద్భుతాన్ని సాధిస్తే చేదిస్తే  ఎవరికి దక్కని అమోఘానందం ఆ పురుషుని వశమౌతుంది.


అనుష్క ఆమె కున్న  ప్రజాధరణ ప్రకారం ఆమె ఒక భావగర్భిత అంశమే (మిస్టరీ) అవును కదా! ఆమె వ్యతిగతంగా మనకు తెలిసింది అతి తక్కువ. కాని, వెండితెరపై ఆమె కనిపించిన ప్రతిసారి కళ్ళు  ఆమె నుండి త్రిప్పుకోలేము. అదే స్కార్పియో స్ట్రీ కున్న చరిష్మా, మనం మానసికంగా మంత్ర ముగ్ధులమౌతాం! దాన్ని తప్పించుకోలేం. ఇంకో ప్రత్యెక లక్షణమేమంటే స్కార్పియో స్త్రీని మచ్చిక చేసుకోలేమూ- అలాగే ఆమె పై ఆధిక్యత కూడా ప్రదర్శించలేము!


ఏ రకమైన నియంత్రణ నైనా స్కార్పియో స్త్రీ ద్వేషిస్తుంది. ఆది ఆ నక్షత్ర సహజ గుణం. దీన్నిబట్టి అర్ధం చేసుకుంటే ఆమె నటించిన సినిమాల్లో కూడా అనుష్క తరచుగా “బాస్ లెడీ”  పాత్రల్లోనే విజయాలు సాధించింది సాదిస్తుంది అలాగే ఆమె నటించిన చిన్న పాత్రైనా గుర్తించ బడుతుంది


వాళ్ళకేది మంచిది



డేటింగ్ గాని పెళ్ళి చేసుకోవటానికి గాని ఒకే జోడియాక్ సైన్ కు చెందిన  వారికి ఒకరినొకరు పుష్కలంగా అర్ధం చేసుకోవటం సహజంగా జరగాలి.  చెప్పటానికి పెద్దగా ఏమీ ఉండదు. అందుకే స్చార్పియో వ్యక్తులు వారి నొకరినొకరు గుర్తిచటానికి ఎక్కువ సమయం తీసుకొంటారు. అది వీరిద్దరి విషయంలో కూడా జరుగుతుండవచ్చు. అందుకే వారు అనేక విషయాలపై సదవగాహన కోసం ప్రయత్నిస్తూ ఉండవచ్చు. వారి సంకీర్ణ ఆకర్షణ అభిరుచి వారినెంత దూరమైనా తీసుకెళ్ళ గలవు అన్నారు లిండా గుడ్మాన్.


వాళ్లకేది మంచిది కాదు



ఒక రకంగా వారి  ఒకేలా ఉన్న వ్యక్తిగత ఆకర్షణ అభిరుచులు కూడా కొన్ని సార్లు వారికి సంబందానికి ప్రతిబందకాలుగా కూడా మారవచ్చు. వివాదాలకు దారి తియ్యవచ్చు.


చాలా గంభీరంగా మృదుస్వభావిగా కనిపించే స్కార్పియో పురుషునికి కోపంవస్తే మృదుస్వభావం వెనుక లావా మండుతూ ఉండి  ఒక్కసారే అమాంతం ఉపరితలం చీల్చుకొని పెల్లుబకవచ్చు. అలాంటి సమయంలో స్కార్పియో స్త్రీ తగ్గి ఉండాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి స్కార్పియో స్త్రీ పురుషులు వివాహమాడితే ఆ సంభందం లో “ఆగ్రహం” ప్రమాదకారి  కావచ్చంటారు లిండా. 


ఒక సలహా



స్కార్పియో స్త్రీ పురుషులు ఆగ్రహం నియంత్రించుకోగలిగితే  - అద్భుతం తృప్తికరం మధురం  అపురూపం అయిన జీవితం వారి స్వంతం.  ఆగ్రహ నియంత్రణ ఇరువురికీ అతి ముఖ్యం. ఆదే జరిగితే వారి అనుభూతులను ఆనందాలను ఎవరూ ఆపలేరు. ఇది మాత్రం మనం చెప్పగలం.


వారు ఒకరికొకరు సానుకూలురే కాబట్టి – మనం చూడముచ్చటైన జంటగా భావిస్తున్న విషయం అధికారికంగా ఆలస్యం చేయకుండా ప్రకటిస్తే చాలు వారికి వారిని ముచ్చటైన జంటగా చూడాల న్న అభిమానుల ఆశ నేరవేరుతుంది.  ఇంతకంటే ఇంకేం చెప్పగలం?    


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: