పవన్ మ్యానియాను తిరస్కరించిన జూనియర్ !

Seetha Sailaja
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాస్ ప్రేక్షకులతోపాటు మాస్ ఆడియన్స్ ను కూడ మెప్పించి సినిమాలు తీయగల సమర్ధుడు. సినిమా కథలో వచ్చే సన్నివేశాలు ఎంత సెంటిమెంటల్ గా ఉంటూ ఆలోచింపజేసే డైలాగ్స్ ఉంటాయో మధ్యమధ్యలో మాస్ ప్రేక్షకులను మెప్పించే భారీ ఫైట్స్ సీన్స్ తీయగల సమర్ధుడు త్రివిక్రమ్.

ప్రస్తుతం జూనియర్ తో తీస్తున్న ‘అరవింద సమేత’ లో త్రివిక్రమ్ డిజైన్ చేసిన ఒక ఫైట్ సీన్ లో నటించడానికి జూనియర్ త్రిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. 
దీనికి కారణం ఆ ఫైట్ సీన్ డిజైనింగ్ పవన్ మ్యానియాను గుర్తుకు చేస్తూ ఉందని జూనియర్ అభిప్రాయపడటం అని అంటున్నారు.  ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ‘అరవింద సమేత’ లో ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ షూట్ చేసిన ఒక ఫైట్ సీన్ ను జూనియర్ పట్టుపట్టి రద్దు చేయించినట్లు తెలుస్తోంది. 

పవన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’ లో తన కళ్ళజోడు కింద పడిపోకుండా పవన్ గూండాలతో ఫైట్ చేస్తాడు. ఇప్పుడు అలాంటి సీన్ ‘అరవింద సమేత’ లో కూడ త్రివిక్రమ్ షూట్ చేసినప్పుడు ముందు ఆ ఫైట్ సీన్ లో యాక్ట్ చేసిన జూనియర్ ఆ తరువాత తనకు ‘అత్తారింటికి దారేది’ సీన్ గుర్తుకు రావడంతో మళ్ళీ అలాంటి సీన్ ఎందుకు డిజైన్ చేసారు అని త్రివిక్రమ్ ను జూనియర్ ప్రశ్నించినట్లు టాక్. 

ఇప్పటికే ‘అరవింద సమేత’ కథ విషయంలో అనేక మార్పులు చేర్పులు చెపుతున్న జూనియర్ సూచనలకు అంగీకరిస్తున్న త్రివిక్రమ్ ఈసారి ఈ ఫైట్ సీన్ విషయంలో కూడ జూనియర్ ఒత్తిడికి తల వంచినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ క్రియేటివిటీ తగ్గిపోతోంది అన్న వార్తలు వస్తున్న పరిస్థుతులలో త్రివిక్రమ్ తిరిగి ‘అత్తారింటికి దారేది’ ఫైట్ సీన్ ను జూనియర్ పై తీయాలి అని ప్రయత్నించాడు అంటే తన సినిమాల టేకింగ్ విషయంలో త్రివిక్రమ్ ప్రస్తుతం ఎంత అయోమయంలో ఉన్నాడో అర్ధం అవుతుంది..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: