విశాఖలో విశాల్ వ్యూహం పై ఆశక్తికర కధనాలు !

Seetha Sailaja
కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు ప్రాంతానికి చెందిన హీరో  అయినప్పటికీ అతడి తల్లితండ్రుల మూలాలు ఆంధ్రపదేశ్ కు సంబంధించినవి కావడంతో విశాల్ తెలుగు సినిమా రంగంలో తన మార్కెట్ పెంచుకోవడానికి విపరీతంగా కృషి చేస్తున్నాడు. విశాల్ లేటెస్ట్ మూవీ ‘అభిమన్యుడు’ సూపర్ సక్సస్ కావడంతో మంచి జోష్ లో ఈ యంగ్ హీరో.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో విశాల్ తన అభిమన్యుడు సినిమాను ప్రమోట్ చేస్తూ లేటెస్ట్ గా జరిపిన విశాఖపట్నం పర్యటనలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సాధారణంగా హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కోసం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు తమ సినిమాను ప్రదర్శిస్తున్న ధియేటర్ కు వెళ్లడమో లేదంటే ఆ ఊరిలో మీడియా వారితో మాట్లాడటమో చేస్తూ ఉంటారు.

అయితే దీనికి భిన్నంగా విశాల్ విశాఖపట్టణంలోని ఎస్ ఇ జెడ్ లో వున్న బ్రాండిక్స్ కంపెనీకి వెళ్లాడు. ఆసియా ఖండం మొత్తం మీదే మహిళలు అత్యథికంగా పని చేసే సంస్థగా గిన్నిస్ రికార్డుకు ఎక్కిన కంపెనీ ఇది. ఈకంపెనీలో 18 వేల వరకు మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి కంపెనీకి విశాల్ పనికట్టుకుని వెళ్ళి అక్కడ మహిళలతో చాలాసేపు మాట్లాడి అక్కడ నిర్మించిన   అక్కడ నిర్మించిన టాయ్ లెట్ కాంప్లెక్స్ ను ప్రారంభించడమే కాకుండా తాను మళ్ళీ వస్తానని మాట ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయాలు అంటే విపరీతమైన అభిరుచి ఉండే విశాల్ రాబోయే ఎన్నికలలో జగన్ కు సపోర్ట్ చేస్తాడని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈవార్తలకు బలం చేకూరుస్తూ విశాల్ విశాఖలో చేసిన హడావిడి మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కలక్షన్స్ తో దూసుకుపోతున్న ‘అభిమన్యుడు’ ఈసినిమాకు పోటీ ఇచ్చే మూవీ ఏది ఇప్పటి వరకు రాక పోవడంతో మన తెలుగు రాష్ట్రాలలో ఈమూవీ కలక్షన్స్ 15కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: