రానా ఆరోగ్యంలో ఊహించని మార్పులు సురేశ్ బాబు టెన్షన్ ?

Seetha Sailaja
హీరో రానాకు ఆరోగ్యం బాగాలేదని ఆమధ్య వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. రానా తన కంటి సమస్య నిమిత్తం ఒక మేజర్ సర్జరీ చేయించుకోబోతున్నాడు అనే వార్తలు కూడ వచ్చాయి. గాసిప్పులకు చెక్ పెట్టే విధంగా ఆ తరువాత నిర్మాత సురేష్ బాబు రానా కంటికి ఆపరేషన్ కోసం విదేశాలకు వెళుతున్నాడని ఒక ప్రకటన కూడ ఇచ్చారు. 

అయితే సినిమా సెలిబ్రిటీల విషయంలో ఎన్ని గాస్సిపులు హడావిడి చేసినా ఇలా అధికారికంగా లీకులు ఇచ్చిన సందర్భాలు లేవు అని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయానికి కొనసాగింపుగా మరో లేటెస్ట్ గాసిప్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. రానా ఆరోగ్యం విషయమై దగ్గుబాటి కుటుంబం కాస్త కలవరపాటులో ఉందని రానాకు కంటి సమస్యతో పాటు కిడ్నీ సమస్య వచ్చిందని సింగపూర్ లో రజనీకాంత్ ను ట్రీట్ చేసిన ఆసుపత్రికి తీసుకెళ్తారని గాసిప్ లు హడావిడి చేస్తున్నాయి.

అయితే ప్రస్తుతం రానాను అమెరికాకు తీసుకు వెళ్ళినా అక్కడి డాక్టర్ల సలహాలతో సింగపూర్ తీసుకు వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. దీనితో రానాకు ఏమైంది అన్న వార్తలు గుప్పు మంటున్నాయి. ఇప్పటికే సురేశ్ బాబు చిన్న కొడుకు అభిరామ్ శ్రీరెడ్డి వివాదంలో చిక్కుకోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా రానా ఆరోగ్యం విషయం పై సురేశ్ బాబు తీవ్రంగా కలవర పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనల నేపధ్యంలో సురేశ్ బాబు తన తండ్రి రామానాయుడు విగ్రహాన్ని ఫిలిం చాంబర్ వద్ద ఆవిష్కరించే కార్యక్రమం కూడ వాయిదా పడింది అని అంటున్నారు. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా రానా ఆరోగ్యం పై హడావిడి చేస్తున్న ఈ గాసిప్పులు మాత్రం రానా అభిమానులకు తీవ్రంగా కలవర పెడుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: