సంక్రాంతి రేస్ లో రాంచరణ్!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు రాంచరణ్.  చిట్టిబాబుగా చెవిటివాడి పాత్రలో రాంచరణ్ నటనకు అభిమానులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం తెగ మెచ్చుకున్నారు.  రంగస్థలం లాంటి హిట్ తో సంతోషంలో ఉన్న రాంచరణ్  బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.  గతంలో బోయపాటితో ఓ చిత్రం తీయాల్సి ఉన్నా అది పెండింగ్ పడుతూ వచ్చింది.  ఇక రంగస్థలం రిలీజ్ సమయంలోనే కొత్త చిత్రానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. 

చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ప్రతిష్టాత్మక డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఈ చత్రం చెర్రీకి 12వ చిత్రం.  ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ జోడీగా కైరా అద్వాని కనిపించనుంది.

ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తుందా? .. సంక్రాంతికి విడుదలవుతుందా? అనే సందేహం అభిమానుల్లో ఉండేది.ఈ నేపథ్యంలో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ వారు అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

  సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండడం విశేషం.

బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు  80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతుండగా, కీలకమైన యాక్షన్ సన్నివేశాల కోసమే 5 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని వినికిడి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: