బిగ్ బాస్ షోలో నాని కామెంట్స్ వెనుక ఆ వ్యక్తి !

Seetha Sailaja
నటి శ్రీరెడ్డి నానీని టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ క్లైమాక్స్ కు చేరుకోవడంతో శ్రీరెడ్డి నానీల వ్యవహారం మీడియాకు హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో నిన్నరాత్రి ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ షోలో నానీ చేసిన కామెంట్స్ నటి శ్రీరెడ్డిని ఉద్దేశించినవా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.  

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాను నెగిటివ్ గా వాడుకుంటున్న వారు ఎక్కువగా పాపులర్ అవుతున్నారు అంటూ కొన్ని వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు నాని. కేవలం 20 సంవత్సరాలు ఉన్న దీప్తి సునైనా సోషల్ మీడియాను ఉపయోగించుకుని యూట్యూబ్ స్టార్ గా మారిన్నట్లుగా పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ గా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ, ఎదుటివారి వ్యక్తిగత జీవితాల పై దాడి చేసేవారు ఆపద్ధతి మానుకుని దీప్తి సునైనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు ఇచ్చాడు నాని.

అంతేకాదు ఎదుటి వారి మానసిక శాంతిని భగ్నం చేస్తూ నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు అని అభిప్రాయపడ్డాడు నాని. తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఫిలింనగర్ రోడ్ల పై అవకాశాల కోసం తిరిగితున్నప్పుడు ఎదుటి వారి పై నెగిటివ్ కామెంట్స్ చేసి కాకుండా తాను తన స్వయం కృషితో ఎదిగిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు ఈ నేచురల్ స్టార్. 

నిన్నటి షోలో ప్రత్యేకంగా నాని దీప్తి సునైనను అడ్డు పెట్టుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచార విషయాన్ని హైలెట్ చేస్తూ మాట్లాడటం వెనుక నాని ‘బిగ్ బాస్ 2’ షో ద్వారా శ్రీ రెడ్డికి ఇన్ డైరెక్ట్ రిప్లయ్ ఇచ్చాడా అన్న సందేహాలు కొందరు వ్యక్తపరుస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నాని పై తన మాటలదాడిని పెంచిన శ్రీ రెడ్డి నాని ఇన్ డైరెక్ట్ మాటలకు  ఎలాంటి స్పందన ఇస్తుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: