పవన్ ఆరోగ్యం పై మీడియా కధనాలు !

Seetha Sailaja
ఉత్తరాంధ్రలో ‘పోరాటయాత్ర’ పేరుతో సుడిగాలి పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ రంజాన్ పేరుతో తన యాత్రకు విరామం ప్రకటించిన విషయంతెలిసిందే. ఒకరాజకీయ పార్టీ తలపెట్టిన యాత్రకు ఇలా ‘పబ్లిక్ హాలిడే’ లు ఏమిటి అంటూ మీడియాలో పవన్ పై సెటైర్లు కూడ పడ్డాయి. అయితే పవన్ ఈయాత్రకు బ్రేక్ తీసుకోవడానికి కొన్ని ఆరోగ్యపరమైన కారణాలు కూడ ఉన్నాయి అంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 

పవన్ హీరోగా ఇప్పటివరకు కొనసాగడంతో సినిమాలలో షాట్ షాట్ కీ మధ్య ఎండ తగలకుండా గొడుగుపట్టడాలు నిమిష నిమిషానికి టచప్స్ చేయడాలు అలవాటుపడిన నేపధ్యంలో పవన్ అతి కష్టంతో కూడిన జనం మధ్య జరిగే ఈయాత్రను బ్రేక్ లేకుండా కొనసాగించలేకపోతున్నాడని టాక్. దీనికితోడు ఈయాత్రలలో విపరీతమైన అభిమానుల తాకిడితో పాటు విపరీతమైన ఎండవల్ల కూడ పవన్ కు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆయన సన్నిహితులే అంగీకరిస్తున్నారు అంటూ ఆమీడియా సంస్థ కథనాన్ని వ్రాసింది. 

అంతకుముందు కళ్ళకు నల్లకళ్లజోళ్లు పెట్టుకుని తిరిగిన పవన్ ఐ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తానే స్వయంగా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆకంటి బాధ తిరగబెట్టి పవన్ బయటకు వెళ్ళనీయకుండ పరిస్తుతులను సృష్టిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా మొన్న జరిగిన రంజాన్ పండుగనాడు  పవన్ ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ సెలబ్రేట్ చేసుకుని వాళ్ళకు శుభాకాంక్షలు చెబుతూ పవన్ తీయించుకున్న ఒక గ్రూప్ ఫోటోలో పవన్ ఎదుర్కొంటున్న కంటి ఇబ్బంది స్పష్టంగా కనిపించింది అని ఆఫోటోను కూడ ప్రచురించింది. పవన్ కళ్ళు ఆరోగ్యంగా లేనికారణంగానే ఆయన్ను బైటికెళ్ళొద్దని డాక్టర్లు సూచించినట్లు జనసేన అనధికారిక వార్తలు చెపుతున్నాయి. 

ఇది ఇలా ఉండగా పవన్ నిర్వహించిన ఉత్తరాంధ్ర సభలలో ఎన్నికల మీటింగ్స్ లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడంతప్ప ఎక్కడా కమిటీలు పార్టీ నిర్మాణం వంటి వ్యవహారాలు పై పవన్ దృష్టి పెట్టకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘జనసేన’ పార్టీకి జవసత్వాలు నింపే పని చేపెట్టకుండా ఎంతసేపు పవన్ ట్విట్టర్ కబుర్లతో ఎంతకాలం రాజకీయాలు చేయగలడు అన్న అనుమానాలు పవన్ అభిమానులలో కూడ ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు రీసెంట్ గా లీక్ అయిన లగడపాటి రాజగోపాల్ సర్వేలో పవన్ ‘జనసేన’ కు పడబోయే ఓట్లు శాతం చూస్తూ ఉంటే పవన్ ‘జనసేన’ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ కన్నా ఘోరంగా దెబ్బతింటుందా అని జరుగుతున్న చర్చలు పవన్ అభిమానుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: