ప్రఖ్యాత టాలీవుడ్ హీరోయిన్ పై చార్జ్-షీట్!

ఈ మద్య సినీరంగ ప్రముఖులనేకులు అనేకులు చట్టవిరుద్ద కార్యక్రమాలలో కూరుకుపోతున్నారు. మొన్న నార్కోటిక్స్ కేసుల్లో నిన్న కాస్టింగ్- కౌచ్ కేసుల్లో నేడు అంతర్జాతీయ వ్యభిచార కార్యక్రమాల్లో షికాగోలో మునిగితేలటం చూస్తూనే ఉన్నాం. వీటికి తోడు తాజాగా దక్షిణ భారత కథానాయకి ఒకరిపై కేరళ ప్రభుత్వం "పన్ను ఎగవేత కేసులో చార్జ్ షీట్ నమోదు చేయబోతున్నదని తెలుస్తుంది. 

ఆమే ప్రముఖ నటి అమలాపాల్ దొంగ చిరునామాతో పాండిచ్చేరీలో  (కేంద్ర పాలిత ప్రాంతం)  తన కారుని రిజిస్టర్ చేయించి తన ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకు రావడంతో ఆమె న్యాయస్థానంలో లొంగిపోయింది. ఆ వెంటనే బెయిల్ పై బయటకు వచ్చింది. అయితే ఈ కేసులో ఇప్పుడు ఆమెపై ప్రభుత్వం చార్జ్-షీట్ నమోదు చేయాలని కేరళ గవర్నమెంట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.


ప్రభుత్వానికి దాదాపు ₹20 లక్షల పన్నుని కట్టాల్సి వస్తుందని అమలపాల్ ఫేక్ అడ్రెస్ తో తన కారుని రిజిస్టర్ చేయించుకుంది. అయితే ఈ కేసులో అమలాపాల్ ను మాత్రమే కాదు అలా పన్ను ఎగ్గొట్టిన ఈ కేటగిరీ వారు ఇంకెవరైనా ఉన్నారా? అని క్రైమ్-బ్రాంచ్ విచారణలోకు రంగంలోకి దిగింది. దీంతో సీనియర్ నటుడు సురేష్ గోపి, హీరో ఫహాద్ ఫజిల్ వంటి తారలు కూడా పన్నుల ఎగవేత కేసులో ఈ విచారణలో పట్టుబడ్డారు.


కేసు న్యాయస్థానంలో ఉండగానే, కేరళ ప్రభుత్వానికి పన్ను చెల్లించే అవకాశం నిందితులకు ఇచ్చింది. ఈ క్రమంలో ఫహద్ ఫాజిల్ పన్ను చెల్లించడంతో ఆయనపై కేసుని ఎత్తివేయటంతో ఆయన విముక్తి పోందారు. కానీ అమలాపాల్, సురేష్ గోపి మాత్రం పన్ను చెల్లించలేదు. సురేష్ గోపి రాజ్యసభ సభ్యుడు కావడంతో లాయర్ల సలహాల మేరకు ఆయనపై చర్యలు తీసుకోనున్నారు. ముందుగా అమలా పాల్ పై మాత్రం చార్జ్ షీట్ నమోదు చేయబోతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: