టాలీవుడ్ హీరోయిన్స్ అమెరికా రంకుబాగోతం - పట్టిచ్చిన పేపర్-ట్రెయిల్

అనుమానం లేదు తెలుగు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వర్దిల్లుతూనే ఉంది. టాలీవుడ్ లో మొదలైన కాస్టింగ్ కౌచ్ దుమారం సర్దుకోకముందే తాజాగా అమెరికాలో వెలుగు చూసిన చీకటి వ్యవహారం వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్ర ధారులు మోదుగుమూడి కిషన్, మోదుగుమూడి చంద్రకళ అనే దంపతులను షికాగోలోని అధికారులు అరెస్ట్ చేసి, విచారణ జరిపి ఈ గురువారం ఇల్లినాయిస్ వ్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. గురువారం జరగబయే విచారణ తరవాత ఒక్క నెల లోనే కేసు వ్యవహారం న్యాయప్రక్రియ మొత్తం ముగుస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.


అసలు ఈ రాకెట్ “గుట్టు రట్టైంది” అనే విషయం ఆ విధం తెలిస్తే ఆశ్చర్యానికి గురికాక తప్పదు. ముందుగా మోదుగుమూడి దంపతులకు వీసా గడువు పూర్తైనా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారనే నేరం మీద అరెస్ట్ చేసిన పోలీసులు వారి ఇంట్లో సోదాలు జరపగా లభ్యమైన అనేక పత్రాల్లో ఒక ప్రముఖ హోటల్ కు సంబందించిన పేపర్ ఒకటి దొరికిందట. దానిపై సినీ తారల పేర్లు వాటి పక్కన తేదీలు, హోటల్ రూమ్ నంబర్లు వరుస క్రమంలో వేసి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆ రాతలు వెనుక ఏదో పెద్ద రాకెట్ ఉందని అనుమానించి విచారణ జరపగా ఈ సినీ తారల వ్యవహారం బయటపడింది.


దాంతో సమగ్ర విచారణలో భాగంగా మోదుగుమూడి దంపతుల ఇంట్లో మరోసారి సోదాలు జరపగా డబ్బు లావాదేవీలకు సంబందించి ఒక డైరీ దొరికింది. అంతేగాక మోదుగుమూడి దంపతులు తెలుగు సంఘాల పేర్లతో నకిలీ లేఖలను సృష్టించి సినీ తారలను అమెరికా రప్పించి ఈ వ్యభిచార ఊబిలోకి లాగుతున్నట్టు కనుగొన్నారు. ఈ సాక్ష్యాల ఆధారంగా విటులను, నటీమణులను విచారించి 42పేజీల పిర్యాధును తయారుచేశారు పోలీసులు.


ఈ నివేదికను రానున్న గురువారం ఇల్లినాయిస్ న్యాయస్థానంలో సమర్పించనున్నారు. తొలిదశ విచారణలోనే కొంతమంది సినీతారలు, నేపద్యంలోని వ్యక్తులపేర్లు బయటపడగా, వాయిదా అనంతరం జరపబోయే తుది విచారణలో సంపూర్ణంగా కొందరు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు చరిత్రలు బయటపడనున్నాయి.


ఈ ఊబి వ్యవహారంతో ఇన్నాళ్లు సినిమా చిత్రీకరణలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో తరచుగా అమెరికా వెళ్లే సినీ తారల్లో అయోమయం నెలకొంది. ఈ సెక్స్ రాకెట్ కారణంగా ఇటీవల అమెరికా ప్రయాణంలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ ను సైతం అక్కడి పోలీసులు అరగంట సేపు విచారించి మరీ, ఆమెకు ఆ రాకెట్ తో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించుకున్న తర్వాతనే ఆమె ప్రయాణానికి అనుమతిచ్చినట్టు సమాచారం. ఆమె ఎవరోకాదు మహానుభావుడు సినిమా కథానాయిక మెహ్రీన్ ఫిర్జాదా!



మెహ్రీన్ ఫిర్జాదాను ప్రశ్నించిన అమెరికా అధికారులు !

గత కొన్ని రోజులుగా అమెరికాలో తెలుగు హీరోయిన్ల గురించి వినిపిస్తున్న వార్తలు ఎంతలా సంచలనం సృష్టించాయో తెలిసిన సంగతే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు కూడా! ఈ విషయాన్ని యూఎస్ పోలీసులు తీవ్రంగా పరి గణించారు. అందుకే ఆమెరికాకు వస్తున్న “తెలుగు సినీ సెలబ్రిటీ” లను క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కు యూఎస్ అధికారుల ద్వారా చేదు అనుభవం ఎదురైంది. కుటుంబసభ్యులను కలవడానికి యూఎస్ వెళ్లిన మెహ్రీన్ అక్కడి నుండి స్నేహితులను కలవడానికి కెనడా వెళ్లేందుకు విమానాశ్రయా నికి వెళ్లగా అక్కడి అధికారులు ఆమెను “తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్” అని తెలుసుకుని ప్రశ్నించారట. ఇక భారత, ముఖ్యంగా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ వ్యక్తులు స్టార్స్ ఇక అమెరికా వెళితే ఎయిర్ పోర్టుల్లో శల్యశోధనలు తప్పదు. హత విధీ! ఇదీ మన టాలీవుడ్ పరిశ్రమ పరువు ప్రతిష్ఠ అమెరికాలో.  


ఈ పరిణామంతో షాక్ కు గురైన తాను 30నిముషాలపాటు వాళ్ళడిగిన అన్నిప్రశ్నలకు సరైనజవాబిచ్చి అమెరికా వచ్చింది కుటుంబ సభ్యులను కలవడానికని వివరించా నని, దాంతో అధికారులు ఎందుకు ప్రశ్నించింది తెలిపి ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణ కూడా చెప్పారని మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా ఇలా కొందరి మూలాన ఎలాంటి పొరపాట్లు చేయని ఇతర హీరోయిన్లు కూడ ఇబ్బందిపడటం విచారించదగిన విషయమే.


అమెరికాలో బయటపడ్ద టాలీవుడ్ సెక్స్ రాకెట్: భారత్ లో మహిళా సంఘాల మండిపాటు!

నటి శ్రీరెడ్డి బయట పెట్టిన కాస్టింగ్-కౌచ్ సంగతి మరుగున పడక ముందే అమెరికా లో టాలీవుడ్ సెక్స్ రాకెట్ మన సినీ పరిశ్రమను ఒక్క కుదుపుకుదిపేసింది. ఇప్పటికే ఆరుగురు హీరోయిన్లు ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారనే మాటలు వినిపించాయి. అయితే ఈ విషయంపై మహిళా సంఘాలు మండి పడ్డాయి. మహిళా సామాజిక కార్యకర్త దేవి మోదుగుమూడి కిషన్ మీద సరైనా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.


నటీమణులకు సంబంధించి వాళ్లు జూనియర్ ఆర్టిస్ట్స్ అయినా డైలాగ్ ఆర్టిస్ట్ అయినా బ్రోకర్ వ్యవస్థను తీసేసి నేరుగా వారి ఖాతాలోకి డబ్బులు వేయాలని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషణ్ – ఎఫ్ డి సి, ని కోరాం. దానికి సంభందించిన పనులు చేస్తున్నామని అన్నారు. అలానే “ఆడిషన్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్” లో కోఆర్డినేటర్లు ఫోటోలు పట్టుకొని తిరగడం అవి ఫిలిం ఛాంబర్ కు ఇవ్వడం వంటి పనులు కాకుండా, సెలెక్షన్ ప్రాసెస్ లో ఛాంబర్, ఎఫ్ డి సి అఫీషియల్ వెబ్ సైట్స్ ఏర్పాటు చేయాలి. ఇదంతా బహిరంగంగా జరగాలి. ఎంపిక చేసుకున్న నటీ నటులతో ఎఫ్ డి సి ఆమోదించిన వాట్సాప్ గ్రూపుల నుండి కమ్యునికేషన్ జరగాలి.


సెక్సువల్ హెరాస్మెంట్ ఉండదు అనే హామీ తో పాటు కొంత సెక్యూరిటీ డిపాజిట్ కూడా నటీనటుల ఖాతాల్లో  జమ  చేయాలి. షూటింగ్ సమయంలో జరగరానిది ఏమైనా జరిగితే అప్పుడు ఆ డబ్బు బాధితులకు  సహాయంగా నిలుస్తుంది. సినిమాలలో పని చేయాలనే ఆకాంక్షతో సినీ పరిశ్రమకు వచ్చే వాళ్లకు “డాన్సింగ్ అండ్ యాక్టింగ్ స్కూల్స్” నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి.  Fఇలిం ఛాంబర్, ప్రభుత్వం, కళాకారులతో కలిసి త్వరలోనే ఒక సదవగాహనా సమావేశం ఏర్పాటు చేయనున్నాం.


గత నాలుగు నెలలుగా ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతున్నా, సినీ పరిశ్రమకు చెందిన పెద్దలెవరు కూడా మాట్లాడడం లేదు. నటీమణులను అమెరికా తీసుకువెళ్లి ఏం చేస్తున్నారో అ నేది అందరికీ తెలుసు. కానీ ఎవరికీ వాళ్లు నోళ్లు మూసుకొని కూర్చున్నారు. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసి సినీ పరిశ్రమ పరువు తీసిందని అన్నవారు ఈ సెక్స్ రాకెట్ గురించి మాత్రం ఎందుకు స్పందించడం లేదు? అంటే విదేశాల్లో టాలీవుడ్ పరువు పోవచ్చా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

తమ్మారెడ్డి విజ్ఞప్తి 

‘కిషన్ గతంలో ఏవో సినిమాలు చేసిఉండొచ్చు. కానీ, ఇపుడు అతడో విటుడిగా మారి రాకెట్ నడుపుతున్నాడు. అలాంటప్పుడు ఇంకా నిర్మాతగా చూపిస్తూ, తెలుగు చిత్రపరిశ్రమతో సంబంధాలు అంటగట్టడం సరికాదు. కిషన్ - చంద్రకళలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దాంతోపాటే కొంత మంది బాధితులను కూడా కాపాడారు.


ఇందులో కొంతమంది టాలీవుడ్ నటీమణులు పాల్గొని ఉండొచ్చు. అలాగనీ మొత్తం తెలుగు ఇండస్ట్రీకి ఆ రాకెట్‌తో లింకు పెట్టడం బాధాకరం. కిషన్ ఓ వ్యభిచార రాకెట్ ను నడిపిస్తున్నాడు. అతడి చేతిలో కొందరు చిక్కుకుంటే అతన్ని పింప్ అనకుండా... ఓ ప్రొడ్యూసర్ అని, సినిమావాడని సంబోధించడం సరికాదు. టాలీవుడ్ సినీ పరిశ్రమ గురించి మంచి చెడులు, రివ్యూలు రాస్తున్నారు. కానీ,  సినీ పరిశ్రమని డ్యామేజ్‌ చేసే కథనాలు మాత్రం రాయకండి’ అని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: