‘భారతీయుడు 2 ’ కన్నా ముందు ‘శభాష్ నాయుడు’!

Edari Rama Krishna
విశ్వనటుడు కమల్ హాసన్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రయోగాత్మక పాత్రలు ఎవ్వరూ చేయలేదు..అందుకే ఆయనను విశ్వనటులు అంటారు.  పొట్టి వాడిగా, పిచ్చివాడిగా, పది పాత్రలు ఒకేసారి వేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.  ప్రస్తుతం కమల్ 'విశ్వరూపం 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేపనిలో వున్నారు.

ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ ఆయన ప్రకటించారు.  అయితే ఈ చిత్రం తర్వాత కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ వస్తుందని అందరూ అనుకుంటున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ కన్నా ముందు ‘శభాష్ నాయుడు’ సినిమాను పూర్తి చేయనున్నట్టు చెప్పారు.  కమల్ కథానాయకుడిగా .. ఆయనే దర్శక నిర్మాతగా 'శభాష్ నాయుడు' సినిమా షూటింగ్ చాలాకాలం క్రితం మొదలైంది.

రమ్యకృష్ణ ..శ్రుతిహాసన్ .. బ్రహ్మానందం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.  అయితే షూటింగ్ సమయంలో ఆయన ప్రమాదానికి గురి కావడంతో కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.  అలా అప్పుడు ఆగిపోయిన ఈ సినిమా షూటింగును తిరిగి మొదలుపెడతానని ఆయన అన్నారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: