చరణ్ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఊహించని మలుపులు !

Seetha Sailaja
రంగస్థలం’ మూవీతో రామ్ చరణ్ కలక్షన్స్ స్టామినా బయటపడటంతో అతడి సినిమాల మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఇలాంటి పరిస్థుతులలో చరణ్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో రాబోతున్న మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈమూవీకి విపరీతమైన మార్కెట్ పలుకుతున్నా చరణ్ వ్యూహాత్మకంగా ఈమూవీ మార్కెట్ ను మరింత పెంచకుండా వ్యూహాత్మకంగా తగ్గించడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్. 

సాధారణంగా ఒక టాప్ హీరో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు ఆతరువాత అదే హీరో నటించే సినిమాను అత్యంత భారీ రేట్లకు బయ్యర్లకు అమ్ముతారు. అయితే చరణ్ బోయపాటిల మూవీ విషయంలో ఈ సీన్ రివర్స్ అయింది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ‘రంగస్థలం’ 92 కోట్ల నెట్ కలక్షన్స్ షేర్ ను సాధించడంతో ఆ రేంజ్ లోనే చరణ్ బోయపాటిల మూవీకి ఆఫర్స్ వచ్చాయని టాక్.

అయితే ఈసినిమా నిర్మాత డివివి దానయ్య ఈ ఆఫర్స్ ను కాదని ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన యూవీ క్రియేషన్స్ వారికి 74 కోట్లకు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి రైట్స్ ఇచ్చేయడం జరిగింది. అయితే ఇలాంటి డీల్ ఒప్పుకోవడం వెనుక దానయ్య పై చరణ్ ఒత్తిడి మరియు సలహాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 

చరణ్ బోయపాటిల మూవీ భారీ బడ్జెట్ తో తీస్తూ ఉన్నా ఆ సినిమా ‘రంగస్థలం’ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం తక్కువ అని చరణ్ అభిప్రాయం అని అంటున్నారు. ‘రంగస్థలం’ మ్యానియాతో తన లేటెస్ట్ సినిమాకు అత్యంత భారీ బిజినెస్ జరిగి ఆతరువాత ఆమూవీ ‘రంగస్థలం’ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కాకపోతే బయ్యర్లు నష్టపోయి చరణ్ ఇమేజ్ కి నష్టం వచ్చే ఆస్కారం ఉండటంతో తాను నటించే అన్ని సినిమాలు ‘రంగస్థలం’ స్థాయిలో సంచలనాలు సృష్టించలేవు అన్న ఉద్దేశ్యంతో చరణ్ తన మూవీల బిజినెస్ ను విపరీతంగా పెంచకుండా వ్యూహాత్మకంగా ముందు చూపుతో చెక్ పెట్టాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి..    
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: