హాట్ టాపిక్ గా మారిన మహేష్ జెంటిల్ మెన్ డీల్ !

Seetha Sailaja
వివాదాలకు దూరంగా ఉండే మహేష్ తన లేటెస్ట్ మూవీని చుట్టుముట్టిన వివాదాలను అతి చాతిచాక్యంగా పరిష్కరించడంలో అతడి ‘జెంటిల్ మెన్’ నేచర్ కనిపించింది అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ కెరియర్ కు సంబంధించి 25వ సినిమాగా రూపొందుతున్న ఈమూవీ పై భారీ అంచనాలు ఉండటంతో ఈమూవీ దిల్ రాజ్ అశ్వినీదత్ పివిపి సంస్థల మధ్య చిచ్చు రగిల్చిన విషయం తెలిసిందే. 

ఈమూవీకి సంబంధించి అప్పుడే డెహ్రాడూన్ లో షూటింగ్ ప్రారంభం అయినా ఈమూవీ నిర్మాతలకు పివిపి సంస్థకు ఏర్పడిన చిచ్చు కోర్టు మెట్లు ఎక్కడంతో ఈమూవీ పరిస్థితి ఏమిటి అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే రంగంలోకి దిగిన మహేష్ ఇచ్చిన జెంటిల్ మెన్ ఫార్ములాకు దిల్ రాజ్ అశ్వినీదత్ లతో పాటు పివిపి సంస్థ అధినేతలు ఒప్పుకోవడం వెనుక మహేష్ తెలివిగా సరిదిద్దిన వ్యవహార శైలిని పరిశీలించిన వారు మహేష్ రాజకీయాలలోకి వస్తే ఖచ్చితంగా సరిపోతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి వచ్చే లాభాలను దిల్ రాజ్ అశ్వినీదత్ పివిపి సంస్థలు సమానంగా పంచుకుంటూ ఈమూవీకి నిర్మాతలుగా ఈముగ్గురు వ్యవహరిస్తారు. అయితే ఈమూవీ ప్రాజెక్ట్ విషయంలో ముందు నుంచి చాల క్రియాశీలకంగా వ్యవహరించి ఈమూవీ లాభాలను పూర్తిగా సొంతం చేసుకోవాలి అని ఆశపడ్డ దిల్ రాజ్ నిరాశ పడకుండా అతడికి వచ్చే ఏడాది చివరిలో మరొక సినిమాను చేసిపెడతాను అని జెంటిల్ మెన్ ప్రామిస్ ఇచ్చి ఈవ్యవహారాన్ని ఇలా ముగించినట్లు టాక్.

దీనితో మహేష్ కు అడ్వాన్స్ లు ఇచ్చి అతడి చుట్టూ తిరుగుతున్న అశ్వినీదత్ దిల్ రాజ్ లకు మహేష్ ‘బ్రహ్మోత్సవం’ తో నష్టపోయిన పివిపి సంస్థ నిర్మాతలకు సమన్యాయం చేస్తూ మహేష్ తనలోని బయటకు కనిపించని రాజకీయ కోణాన్ని చాల తెలివిగా బయటపెట్టాడు అని అంటున్నారు. వాస్తవానికి ఈ డీల్ కుదిర్చింది మహేష్ అయినా మహేష్ ను వెనక ఉండి ఈవిషయంలో నడిపించింది నమ్రత సలహాలు అంటూ కూడ వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: