మనతో మనం కనెక్ట్ అయ్యే మార్గం యోగా !

Seetha Sailaja
ఈరోజు 21 జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచానికి భారతీయ సంస్కృతి అంధించిన అరుదైన బహుమానం యోగా. ‘నీకు నువ్వు ఇచ్చుకునే విలువైన నజరానా యోగా సాధన’ అంటూ ప్రముఖ టిబెట్ రచయిత రిన్ పోచే అభిప్రాయపడ్డారు అంటే యోగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది దృష్టిని ఆకర్షించిందో అర్ధం అవుతుంది. శరీరాన్ని బుద్ధితో బుద్ధిని మనసుతో మనసును ఆత్మతో ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయగల శక్తీ మనకు యోగా ద్వారా లభిస్తుంది. 

జ్ఞానాన్ని పొందాలన్నా మన మనసును నిగ్రహించుకావాలన్నా యోగాకు మించిన సాధనం ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు. మన ఆలోచనలకు మానసికంగా ఆధ్యాత్మికంగా అదుపు చేయగల శక్తి ఒక్క యోగాకు మాత్రమే ఉంది. మన శరీరంలోని 72 వేల నాడులు 206 ఎముకలు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 5 కోశాలు అదుపులో పెట్టగల శక్తి ఒక్క యోగాకు మాత్రమే ఉంది. అంతర్ముఖమైన మనలోని మనమను తెలుసుకోవాలి అంటే అది యోగా ద్వారానే సాధ్య పడుతుంది.

ముఖ్యంగా మనుషుల మధ్య బంధాలు నశించి ప్రతి మనిషిలోను ‘ఇగో’ పెరిగిపోతున్న నేపధ్యంలో మనషి అహంకారిగా మారుతున్న పరిస్థుతులలో ఈ ఇగో ను నాశనం చేయగల శక్తి ఒక్క యోగా ధ్యానంతో మాత్రమే కుదురుతుందని పాశ్చత్య దేశాలలోని అనేకమంది మేధావులు కూడ అంగీకరిస్తున్నారు. ప్రపంచంలో జరుగుతున్న అనేక నేరాలకు అన్యాయాలకు ‘అహం’ కారణం అవుతున్న నేపధ్యంలో యోగాని ధ్యానం చేసే వారిలో ఈ అహం పూర్తిగా నశించిపోతుంది అని అందరూ అంగీకరిస్తున్నారు. 

ప్రస్తుతం చాలామంది యోగా అంటే మన శరీరాన్ని అసాధ్యమైన భంగిమలలో తిప్పడం అన్న భావనతో ఉన్నారు. తలక్రిందులుగా నుంచోవడం శరీరాన్ని మెలికలు తిప్పడం యోగా కాదు. వాస్తవానికి యోగా ఒక వ్యాయామ పద్ధతి కాదు. యోగా మనిషిని తన మనసుకు చేరుకోగలిగే శక్తిని ఇచ్చే ఒక సాధనం యోగా. యోగా అంటే ‘ఐక్యం’ అని అర్ధం. మనం పంచభూతాలతో ఐక్యం అయిపోయే భావన రాకుండా మనం ఎన్ని యోగా భంగిమలు నేర్చుకున్నా ప్రయోజనం ఉండదు అని అంటున్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచయోగా దినోత్సవ సందర్భంగా దాదాపు 5 వేల కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో మన భారత రాయబార కార్యాలయాలు అక్కడ స్థానికులతో కలిసి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయి కాబట్టి ఈ యోగా పట్ల ప్రస్థుతం మనదేశ యువతలో కూడ ఆసక్తి పెరగడం ఒక మంచి పరిణామం.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: