నిర్మాతగా శృతిహాసన్ కొత్తావతారం!

Edari Rama Krishna
భారతీయ చలన చిత్రరంగంలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న హీరో కమల్ హాసన్.   కెరీర్ పరంగా ఎన్నో అవార్డులు అందుకున్న కమల్ హాసన్ నట వారసురాలిగా ఆయన పెద్ద కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.   శృతి హాసన్ సింగర్.. యాక్టర్…డాన్సర్…మ్యూజిక్ డైరెక్టర్ అన్ని రంగాల్లో తనదైన ప్రతిభ కనబరిచింది.  ఇప్పటివరకూ తనలో సింగర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌ని చూపించింది.

త్వరలో ప్రొడ్యూసర్‌ని చూపిస్తానంటోంది.  తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ నటించిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.  తర్వాత స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది.   కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ త్వరలో కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నారు.

ప‍్రస్తుతం తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శభాష్‌నాయుడు సినిమాతో పాటు మరో రెండు తెలుగు సినిమాలకు శృతి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. జయప్రకాష్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించనున్న ‘ది మస్కిటో ఫిలాసఫీ’తో శృతి హాసన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. విమర్శకుల ప్రసంశలు అందుకోవడంతో పాటు అంతర్జాతీయ, జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన మలయాళ, తమిళ సినిమా ‘లెన్స్’ దర్శకుడు ఈయనే.

అతడి ఆలోచనలు నచ్చడంతో ‘ది మస్కిటో ఫిలాసఫీ’ నిర్మించదునైకి అంగీకరించానని శృతి తెలిపారు.  అయితే ఇది పూర్తి స్థాయి సినిమానా లేక వెబ్‌ వర్షనా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: