రాజకీయంగా షాక్ ఇచ్చిన పవన్ చంద్రబాబు భేటీ !

Seetha Sailaja
గత కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబును లోకేష్ ను టార్గెట్ చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ‘పోరాట’ యాత్రలు చేస్తున్న పవన్ నిన్న అరగంట సేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశం కావడం మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా రాజకీయ వర్గాలలో విపరీతమైన చర్చలకు ఆస్కారం ఇచ్చింది. ఇప్పటి వరకు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం గడపుతున్న చంద్రబాబు పవన్ లను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కలిపింది. 

గుంటూరు జిల్లా పెద కాకాని మండలం నంబూరు గ్రామ పరిధిలో లింగమనేని టౌన్ షిప్ వద్ద నిన్న నిర్వహించిన శ్రీదశావతార వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టా కార్యక్రమానికి హాజరైన పవన్ చంద్రబాబులు ఒకరికొకరు నవ్వుకుంటూ పలకరించుకోవడం మీడియా కెమెరాలకు హాట్ న్యూస్ గా మారింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేశ్ ఈ ఆలయాన్ని నిర్మించడమే కాకుండా పవన్ చంద్రబాబులు ఒకే కార్యక్రమంలో పాల్గొనే విధంగా భారీ వ్యూహాలు రచించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చిన వీరిద్దరూ కొద్దిసేపు ఏకాంతంగా ఒక గదిలో భేటీ అయినట్లు ఒక ప్రముఖ దినపత్రిక ఈరోజు ఈవిషయమై ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. పవన్ చద్రబాబుల మధ్య దూరం పెరిగింది అని అందరూ భావిస్తున్న నేపధ్యంలో ఈ అంతరంగిక సమావేశం అర్ధం ఏమిటి అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. 

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంగళగిరి సమీపంలో నిర్మిమిస్తున్న సొంత భవనం కోసం విలువైన స్థలాన్ని కూడ లింగమనేని చౌకగా సమకూర్చాడు అన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు అదే వ్యక్తి పవన్ చంద్రబాబులు ఒకే కార్యక్రమంలో పాల్గునేట్లు చేయడం ఇప్పుడు సంచలన వార్తగా మారింది. సినిమాలలో రాజకీయాలలో ఎవరూ ఎవరికీ శాశ్విత శత్రువులు శాశ్విత మిత్రులుగా ఉందని నేపధ్యంలో వీరిద్దరి మధ్య శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ ఏకాంత భేటి దేనికి సంకేతం అంటూ ఇప్పుడ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో లోతైన చర్చలు జరుగుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: