హీరోయిన్స్ అందులో అడుగు పెడితే ఇక అంతేనా..!

Prathap Kaluva

నిజం చెప్పాలంటే హీరోయిన్స్ కి అవకాశాలు ఒక వయసు వరకు మాత్రమే పరిమితం. తరువాత వారికి అవకాశాలు రావని చెప్పాలి. తరువాత వారు ఇక అమ్మ పాత్రల్లో, లేదా వదిన పాత్రల్లో నటించాల్సి వస్తుంది. అందుకే హీరోయిన్స్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సూత్రాన్ని పాటిస్తారు. అయితే  కొంత మంది నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి చేతులు కాల్చు కున్న సంగతీ మనకు తేలిసిందే. అయితే ఇప్పడూ తాజాగా నయనతార ఆ లిస్ట్ లోకి చేరబోతుందని టాక్ నడుస్తుంది. 


మొన్నామధ్య ఉదాహరణ చెప్పాలంటే భూమిక పేరు ప్రస్తావించుకోవాలి. పెళ్లి చేసుకున్నాకా నిర్మాణం వైపువెళ్లి భూమిక డబ్బును లాస్‌ చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు తెరమరుగు అయ్యింది కూడా. మళ్లీ నటిగా వస్తోందిప్పుడు. ఇలా హీరోయిన్లకు నిర్మాణం అనేది పెద్దగా కలిసొచ్చే అంశంకాదని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఇలాంటి సాహసమే చేయబోతోందట నయనతార. దక్షిణాదిన టాప్‌ రెమ్యూనరేషన్‌ తీసుకున్న హీరోయిన్లలో ముందున్న నయనతారకు ఇప్పుడు కూడా చేతినిండా అవకాశాలున్నాయి.


 అయితే ఇప్పుడు అలాంటి డబ్బును నిర్మాతగా ఇన్వెస్ట్‌ చేయబోతోందట నయన. అది కూడా ప్రియుడి కోసం. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో సినిమాలు తీయడానికి ఈమె రెడీ అవుతోందట. అంతేకాదు.. ఆ సినిమాతో అతడు హీరో కాబోతున్నాడట కూడా. ప్రియురాలిని నిర్మాతగా పెట్టి, హీరోగా పరిచయం కావాలన్న ప్రయత్నం అతడిని ఏ మేరకు సక్సెస్‌ చేస్తుందో కానీ.. నయనతార ఇలా చేయడం మాత్రం అలాంటిలాంటి సాహసం కాదు. ఈమె ఇలా చేయబోతోందనే వార్తలే.. చాలామంది హీరోయిన్ల ఫెయిల్యూర్‌ స్టోరీలను గుర్తు చేస్తోంది. అయితే నయన మాత్రం అలాంటిదేమీ లేదని అంటోంది. తను నిర్మాతగా మారడంలేదని చెబుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: