‘బాహుబలి-2’కి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి’, ‘బాహుబలి2’. అప్పటి వరకు బాలీవుడ్, కోలీవుడ్ లోనే అత్యంత ప్రమాణాలతో చిత్రాలు తీస్తారని..అలాంటి చిత్రాలకే అవార్డులు దక్కుతాయన్న భ్రమలో ఉండేవారు.  కానీ బాహుబలి చిత్రం తర్వాత వాటన్నింటికీ బ్రేక్ పడింది.  తెలుగు లో కూడా ఇంత అద్భతంగా చిత్రాలు తీస్తారా అని అందరూ ఆశ్చర్యపోయారు.   ఎస్ ఎస్ రాజమౌళి ‘ఈగ’చిత్రం కూడా జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది.

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదు సంవత్సరాలు కష్టపడి ‘బాహుబలి, బాహుబలి2’ చిత్రాలు అభిమానులకు అందించారు.  ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క,రమ్యకృష్ణ లాంటి వారికి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.  భారతీయ చలన చిత్ర రంగంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా బాహుబలి 2 గౌరవం దక్కించుకుంది.  తాజాగా ‘బాహుబలి’కి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు దక్కింది.

ఫిబ్రవరి 2017 - ఫిబ్రవరి 2018 మధ్య విడుదలైన చిత్రాల్లో విశేషంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిల్మ్స్ సంస్థ శాటరన్ అవార్డులను ప్రతి ఏటా అందజేస్తుంటుంది.  అందులో భాగంగా  44వ శాటరన్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది జరిగింది.  మొత్తం ఆరు చిత్రాలు పోటీ పడగా ‘బాహుబలి: ది కన్ క్లూజన్’కు ఈ అవార్డు దక్కింది. కాగా, ‘బాహుబలి’కి ఈ అవార్డు దక్కడంపై సినీ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: