ఆ ప్రొడ్యూసర్ నన్ను ముద్దుపెట్టుకోవాలని చూశాడు!

Edari Rama Krishna

బాలీవుడ్ నటి, ఫెమినిస్ట్, కాస్టింగ్ కౌచ్ లాంటి ఉదంతాలపై నిర్మొహమాటంగా మాట్లాడే బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ఓ సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ నుంచి తాను తప్పించుకున్నానని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తెలిపింది. ఓ నిర్మాత నుంచి తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది.


తన వెనుక నిల్చుని 'ఐ లవ్ యూ బేబీ' అంటూ తనను తాకబోయాడని, తన చెవికి ముద్దు పెట్టడానికి యత్నించాడని తెలిపింది. అంతే కాదు తన ఇంటి అడ్రస్ చెప్పాలని ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. ఇలాంటివన్నీ కూడా కాస్టింగ్ కౌచ్ కిందకే వస్తాయని స్వరభాస్కర్ చెప్పుకొచ్చారు. చిత్ర రంగంతో పాటు చాలా రంగాల్లో  మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించడం లేదని అన్నారు.


ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.  శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం... బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. మరోవైపు, తెలుగులో హిట్ అయిన 'ప్రస్థానం' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. సంజయ్ దత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో... స్వరా భాస్కర్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: